ప‌వన్ క‌ళ్యాణ్ ..నేను నీ స్పీచ్‌కి ఫుల్ ఫిదా.. చిరంజీవి కామెంట్ 

ప‌వన్ క‌ళ్యాణ్ ..నేను నీ స్పీచ్‌కి ఫుల్ ఫిదా.. చిరంజీవి కామెంట్ 

లోకల్ గైడ్:

పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స్పీచ్‌తో అద‌ర‌గొట్టారు.అచ్చమిల్లై..అచ్చమిల్లై అంటూ సాగే పాటను పాడారు పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స్పీచ్‌తో అద‌ర‌గొట్టారు.అచ్చమిల్లై.. అచ్చమిల్లై అంటూ సాగే పాటను పాడిన ప‌వ‌న్ త‌న‌కు భయం లేదు..భయం లేదు..అంటూ తన ధైర్యానికి కారణాన్ని పేర్కొన్నారు.ఇల్లేమో దూరం..చేతిలో దీపం లేదు..గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని కనుకే..అన్నీ ఒక్కడినై..2014 లో జనసేన పార్టీ స్థాపించాను.భావ తీవ్రత ఉంది కాబట్టే 2018 లో పోరాట యాత్ర చేశాం.ఓటమి భయం లేదు కాబట్టే 2019 లో పోటీ చేశాం.ఓడినా అడుగు ముందుకే వేశాను.మనం నిలబడ్డాం.పార్టీని నిలబెట్టాం.మనం నిలదొక్కుకోవడమే కాకుండా..నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం.మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మేలేశారు,జబ్బలు జరిచారు,తొడలు కొట్టారు.మన ఆడపడుచులను అవమానించారు.ప్రజలను హింసించారు.ఇదేమి న్యాయం అని మన జనసైనికులు,వీర మహిళలు గొంతెత్తితో వారిపై కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు.ఈ ఎన్నికలో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి తొడలు గొట్టినవారికి బుద్ధి వచ్చేలా ఆ గేట్లను బద్దలు కొట్టాం.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలతో అడుగు పెట్టాం.దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం.అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.