వంగూరి వాచకం -నవరత్నాలు 

వంగూరి వాచకం -నవరత్నాలు 

లోకల్ గైడ్:
1.పువ్వును చూసైనా
నువ్వు నిజం తెలుసుకో
 నవ్వులు రువ్వైనా
నలుగురి మనసు గెలుసుకో 

2.పిక్క బలం తక్కువైనా 
పిట్ట బంధం గట్టిదే
దిక్కులేని శకుంతలకైనా 
రక్షణ ఛత్రం పట్టలేదా

3.వ్యూహకర్తలు లేకుండా 
ఎవరూఎన్నికలు గెలవలేరా?
కృష్ణుడు లేకుండా 
కురుక్షేత్రం పాండవులు గెలిచేవారా 

4.ఎండలు మెండుగా 
పెరిగాయని నీకు కోపమేలా 
నిండుకుండలా మేఘాలై 
వర్షించేది నీకోసమేగా 

5.చల్లగాలి సోకితే 
తనువుకు సుఖానుభూతి 
సాంత్వన మాట తాకితే 
మనసుకు సానుభూతి 

6.ఇతరులపై ఆధారపడటం 
ఇబ్బందులకు తొలి మెట్టు 
చీకటిలోకి నీవు వెళితే 
నీడనే నిన్ను విడిచిపెట్టు 

7.మండుటలు ఒకవైపు 
మండే ధరలు మరోవైపు 
టోపీ పెట్టించే వారు ఒకరు 
టోపీ పెట్టేవారు మరొకరు

8.సంసారంలో అడుగు పెట్టాక 
సమస్యలకు భయపడటమా
సాగరం ఏనాడైనా 
అలలకు కలవరపడునా 

9.అంగట్లో దొరకదు 
ఆస్తులతో పెరగదు 
అప్రమత్తతతో నీవుంటే 
ఆనందం ఆరోగ్యం నీ వెంటే

వంగూరి గంగిరెడ్డి 
9652286270
షాద్ నగర్

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌.. అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
లోకల్ గైడ్: ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో విజ‌య‌శాంతి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి . కొత్త దర్శకుడు ప్రదీప్...
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?
కట్ర్యాల లో అగ్ని ప్రమాదం 
అటల్ జీ యాది లో ఆత్మీయ సమ్మేళనం
కేటీఆర్, జగదీష్ రెడ్డి ల దిష్టిబొమ్మల దగ్ధం