మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో సుభాష్ శర్మకు మరణ శిక్ష మిగతా ఆరుగురికి జీవిత ఖైదు మరియు జరిమాన.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో సుభాష్ శర్మకు మరణ శిక్ష మిగతా ఆరుగురికి జీవిత ఖైదు మరియు జరిమాన.

లోకల్ గైడ్ ,నల్లగొండ:

మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ప్రణయ్ ను హత్య చేసిన కేసులో  నిందితుల్లో A1 మారుతి రావు చనిపోగా A2 సుభాష్ శర్మకు ఉరి శిక్ష అదేవిధంగా కేసులో ఏ3 మహమ్మద్ అస్గర్ అలీ, ఏ4 మహమ్మద్ అబ్దుల్ బారి, ఏ5 మహమ్మద్ అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరి  శ్రవణ్, ఏ 7 సముద్రాల శివ, ఏ8 యం.ఏ నిజాం జీవిత ఖైదు విధించడం జరిగింది  అని  జిల్లా ఎస్పీ శరత్ చంద్ర  పవర్ వెల్లడించారు.సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో  2018 జనవరి 31 అమృత, ప్రణయ్ ఇద్దరు కులాంతర ప్రేమ వివాహం చేసుకోగా ఇది నచ్చని అమృత తండ్రి మారుతీ రావు తట్టుకోలేక ప్రణయ్ హత్యకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద మాటు వేసిన నిందితులు ప్రణయ్ ను అతి కిరాతకంగా చంపారు. ఇదే విషయంపై మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రణయ్ తండ్రి పెరుమల్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు నిందితులు మొత్తం 8 మంది  పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్ సీట్ దాఖలు చేయగా,ఐదేళ్ల పాటు కొనసాగిన వాదోపవాదల అనంతరం ఇవాళ నిందితుల్లో A1 మారుతి రావు చనిపోగా A2 సుభాష్ శర్మకు ఉరి శిక్ష అదేవిధంగా కేసులో ఏ3 మహమ్మద్ అస్గర్ అలీ, ఏ4 మహమ్మద్ అబ్దుల్ బారి, ఏ5 మహమ్మద్ అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరి  శ్రవణ్, ఏ 7 సముద్రాల శివ, ఏ8 యం.ఏ నిజాం జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ 2వ అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించడం జరిగింది. ఈ కేసులో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితులకు శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, పి.శ్రీనివాస్, ఎస్ డి పి ఓ మిర్యాలగూడ, బి.సుధీర్ కుమార్,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీప్, ప్రస్తుతం ఎస్ డి పి ఓ కె రాజశేఖర రాజు, ఎస్ డి పి ఓ మిర్యాలగూడ,  పి ఎన్ డి ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎం ఎల్ జి -1( టీ) సైది రెడ్డి, ఎస్సై సిడిఓ సిహెచ్ వీరస్వామి, ఏ.యస్.ఐ మధుసూధన్, లైజన్ అధికారులు, పి.నరేందర్, ఎన్.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News