నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి 

ఇరువర్గాలను చెదరగొడుతుండగా ఎస్సై కి స్వల్ప గాయాలు 

నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి 

 లోకల్ గైడ్ తెలంగాణ , వరంగల్ జిల్లా ప్రతినిధి : నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డు లో ఓ వెంచర్ దగ్గర  ఉద్రిక్తత చోటుచేసుకుంది.భూమి మాది అంటే మాది అంటూ ఇరువర్గాలు రాళ్లదాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.స్థానిక ఎస్సై రవికుమార్ కి స్వల్ప  గాయమైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే నర్సంపేట పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోని సర్వే నెంబర్ 111లో గత కొన్ని రోజులుగా గొడవ నడుస్తున్నది.ఈ క్రమంలో కోర్టుకు సైతం ఇరు పక్షాలు వెళ్లారు. గడిచిన కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరి  తారాస్థాయికి చేరుకున్నది.  మంగళవారం రోజున ఇరు వర్గాలకు  చెందిన కొందరు భూమిలో పనులు జరుపుతున్నారని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య రాళ్ళ దాడి జరిగింది. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు జనాలను చేదరగొట్టే క్రమంలో స్థానిక ఎస్సై రవికుమార్ కు స్వల్ప గాయం అయింది ఈ విషయం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సండే ఘటన స్థలంలో ఇరువు వర్గాలతో మాట్లాడి సమస్యను సద్దుమణిగే ప్రయత్నం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News