ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల....

రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల....

*కుటుంబ అభివృద్ధికి పునాది లాగా సొంతిల్లు పని చేస్తుంది

*4 విడతలలో ఇందిరమ్మ ఇండ్లకు నిధుల విడుదల

*రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

*వైరా మండలం పుణ్యపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

లోకల్ గైడ్ తెలంగాణ,ఖమ్మం:

ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.మంగళవారం మంత్రి, వైరా మండలం పుణ్యపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేసి, ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులైన దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు పడిన ఇబ్బందులు గమనించి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించాలనే లక్ష్యంతో 4 లక్షల 50 వేల ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు అదనపు ఇండ్లు మంజూరు సైతం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పేదలకు 4 విడతల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో సొంత ఇండ్లు అందించే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని జనవరి 26న రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక  పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని అన్నారు. పుణ్యపురం గ్రామంలో 5 కోట్ల 50 లక్షల రూపాయల ఖర్చుతో 108 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసుకొని, నేడు నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.  ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని అన్నారు. గతంలో  2004 నుంచి 2014 మధ్యలో సుమారు 23 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టించామని అన్నారు. ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇంటి నిర్మాణానికి ఎటువంటి నిబంధనలు లేవని మంత్రి తెలిపారు. పేదలకు 4 విడతలలో ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయం అందుతుందని, ఫౌండేషన్ వేసిన తర్వాత లక్ష రూపాయలు, కిటికిలు వేసిన తర్వాత లక్ష పాతిక వేలు, స్లాబ్ దశ చేరిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు, ఇండ్లు పూర్తి చేసిన తర్వాత మరో లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల సహాయం పేదలకు ఇంటి కోసం  అందుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్న గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News