ఘనంగా సంభాజీ మహారాజ్ వర్ధంతి
నమ్మిన ధర్మం కోసం బలిపీఠం ఎక్కిన యోదుడు
త్యాగాల స్పూర్తితో యువత
లోకల్ గైడ్ తెలంగాణ ,కొత్తగూడెం:
చత్రపత్రి సంభాజీ మహారాజ్ నమ్మిన ధర్మం కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన మహా యోధుడని, ఆయన త్యాగం మరువ లేనిదని ప్రముఖులు ఆళ్ళ మురళీ,బిజెపి జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్, బిజెపి నాయకుడు మనోహర్ అన్నారు. మంగళవారం ఛత్రపతి సంభాజీ మహారాజ్ 336 వర్థంతి సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో సంభాజీ విగ్రాహన్ని కార్డు బోర్టుతో చేసిన శంభాజీ విగ్రహానికి పూల మాలలు వేసి వివాళులు అర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ మొఘల్ పాలనలో అత్యంత కృారుడు ఔరంగజేబు అన్నారు. మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుని తద్వారా ధిక్షణ భారతంలో తన సామ్రాజ్యాన్ని విస్తారించాలనే కలను మరాఠా యోధుడు సంభాజీ మహారాజ్ ధీటుగా ఎదుర్కొని మొఘల్ పాలకులకు ముచ్చెంమటలు పట్టించిన ధీశాలి అని కొనియాడారు. శంభాజీ మహారాజ్ పరాక్రమం చూసి భయపడిన ఔరంగాజేబు నేరుగా శంభాజీని ఓడిరచలేమని తెలిసి కుతంత్రాలను రచించి ఒంటరిగా ఉన్న శంభాజీ మహారాజ్‌ను బంధీగా పట్టుకుని చిత్ర హింసలకు గురిచేసినా తాను నమ్మిన ధర్మం కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప మహనీయూడని కొనియాడారు. గొప్ప వీరుని గాధను చరిత్రకారులు మరుగున పడేయడం సోచనీయం అన్నారు. ఆయన స్పూర్తితో యువత ముందుకు సాగాలని ఆకాంక్షించరు. ఈ కార్యక్రమంలో ఊకంటి గోపాలరావు, కోనేరు చిన్ని, వై శ్రీనివాస్ రెడ్డి, కెకె శ్రీను, వాసు, ప్రసాద్, జోగు ప్రదీప్, మహేష్, కిరణ్, దిలీప్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List