ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

లోకల్ గైడ్, హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఖమ్మం టిని-టాట్స్ హైస్కూల్ కరస్పాండెంట్ శెట్టి భాస్కర్ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీతో పాటు కలిసి పాఠశాల రజతోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా ఆహ్వానించారు. ఖమ్మం బస్ డిపో రోడ్డులో ఈ పాఠశాల నెలకొంది.తన పాఠశాల రజతోత్సవాల సందర్భంగా వచ్చే నెల (మార్చి)ఒకటవ తేదీన నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా కోరుతూ భాస్కర్ ఎంపీ రవిచంద్రను మంగళవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఖమ్మం పెవిలియన్ మైదానం పక్కనే ఉన్న శ్రీభక్త రామదాసు కళాక్షేత్రంలో శనివారం ఉదయం జరిగే ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేయనున్నట్లు శెట్టి భాస్కర్, ఆకుల గాంధీలు తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News