ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుంది.

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుంది.

తుమ్మలపల్లి లో అండర్ డ్రైనేజ్, సిసి రోడ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

లోకల్ గైడ్ తెలంగాణ,జిల్లేడు చౌదరిగూడెం:

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన  ప్రతి హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో అండర్ డ్రైనేజీ, సిసి రోడ్డు పనులను ఎమ్మేల్యే ప్రారంభించారు. అండర్ డ్రైనేజీ పనులు 4.5 లక్షలు, 6 లక్షలతో, రూ. 4.5 లక్షల నిధులు తుమ్మలపల్లి గ్రామానికి మంజూరు కావడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అంచలంచలుగా నిధులు విడుదల చేస్తూ ఉన్నామని పనులను గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ జగదీశ్వర్, ఆర్ఐ శ్రీనివాస్, నాయకులు పీట ప్రభుదాస్, రజిత, జాకారం చంద్రశేఖర్, పురుషోత్తం రెడ్డి, ఆంజనేయులు సత్యనారాయణ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, రవి, బాలరాజ్,  రామకృష్ణ, పద్మారం నరసింహులు, అశోక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News