దివ్యాంగులకు యూనిక్ డిజిటబులిటీ ఐడి కార్డు జారీ పై అపోహలు వద్దు 

 దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలి 

దివ్యాంగులకు యూనిక్ డిజిటబులిటీ ఐడి కార్డు జారీ పై అపోహలు వద్దు 

 మీసేవ కేంద్ర నిర్వాహకులు ప్రభుత్వ పథకాల పట్ల దివ్యాంగులకు అవగాహన కల్పించాలి

 మీసేవ కేంద్రాలలో అదనంగా రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం 

దివ్యాంగులకు యూనిక్ డిజబులిటీ ఐడి కార్డ్ జారీపై అవగాహన సదస్సులో  కలెక్టర్ 

లోకల్ గైడ్ తెలంగాణ ,భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

దివ్యాంగులకు యూనిక్ డిజబులిటీ ఐడి కార్డు జారీపై ఎటువంటి అపోహలు వద్దు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మహిళా,శిశు, వయోవృద్ధుల మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, మీసేవ కేంద్ర నిర్వాహకులకు  యూనిక్  డిసబిలిటీ ఐడి కార్డ్  (యుడిఐడి)  జారీపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు యూనిక్ డిజిటబులిటీ ఐడి కార్డు జారీపై ఎన్నో రకమైన అపోహలు కలిగి ఉన్నారని, వాటిని నివృత్తి చేయడం కొరకే ఈరోజు ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.దివ్యాంగులకు ఇకపై సదరం సర్టిఫికెట్ల జారీ విధానం ఉండదని, వారికి యూడీఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. వైద్యులు ధ్రువీకరించిన వైకల్య శాతం సర్టిఫికెట్‌ను, దివ్యాంగుల పూర్తి వివరాలను యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. యూడీఐడీ కార్డులు స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా నేరుగా దివ్యాంగుల చిరునామాకు చేరుతాయన్నారు. ఈ కార్డు కోసం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. పూర్వం సదరం ద్వారా 8 రకాల వైకల్యాలకు  మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు యూనిక్ డిజబులిటీ ఈ కార్డు ద్వారా 21 రకాల వైకల్యాలకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ యూనిక్  డిజేబులిటీ ఐడి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి 5 సేవలు అందుబాటులో ఉన్నాయని, దానిలో 1)కొత్తగా యుఐడిఐ కార్డు దరఖాస్తు,2) పాత సదరం కార్డు ఉండి యుఐడిఐ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి,3) కార్డు పోయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవడం,4) కార్డుల్లో తప్పులు సరి చేయడం మరియు 5) వివిధ కారణాల వల్ల సర్టిఫికెట్ రాని వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అన్నారు. ఈ యు ఐ డి ఐ దరఖాస్తు చేసుకోవడానికి పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, లింగము, ఫోటో, సంతకం, ఆధార్ కార్డు నెంబరు మరియు అడ్రస్ ఉచితమైన సమాచారాన్ని నమోదు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇంతకుముందు సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్నవారు డిఆర్డిఏ కార్యాలయం నందు సంప్రదించడం ద్వారా వారికి యూడిఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్డు కావలసినవారు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మీసేవ కేంద్రాల్లో వివిధ అవసరాలపై వచ్చిన దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని, పథకాల అమలకు వారు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ద్వారా లబ్ది పొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు స్వయం ఉపాధి పథకం, వివాహ ప్రోత్సాహక బహుమతులు, దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలు, విద్యార్థులకు స్కాలర్షిప్, బస్ మరియు ట్రైన్ ప్రయాణాలలో రాయితీ మరియు దివ్యాంగులకు అందించే ఉపకరణాలు పై దివ్యాంగులకు అవగాహన ఉండాలని ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. మీసేవ కేంద్రాలన్నిటిలోను ప్రభుత్వ పథకాలు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి బస్ పాస్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నిటికీ సంబంధించిన బ్యానర్లు లేదా పోస్టర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగులకు ఉద్యోగంలో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా జిల్లాలో సింగరేణి, నవభారత్, ఐటిసి లాంటి సమస్యల్లో కూడా శిక్షణ కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రం ద్వారా దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చిన్న పరిశ్రమల ఏర్పాటు కు రాయితీ కల్పిస్తుందని వాటిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.మీసేవ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులకు మంచి సర్వీస్ అందించాలని కలెక్టర్ సూచించారు. వివిధ అవసరాలతో మీ సేవ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు వద్ద అధిక రుసుము వసూలు చేసిన, వారికి అందించే సేవల లో అలసత్వం ప్రదర్శించిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మీసేవ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఇల్లందులో తమకు బిల్లింగ్ అనుమతి అడుగగా కలెక్టర్ అవసరమైనచోట ఉపయోగం లేకుండా బిల్డింగులు నిర్మించడం కంటే ఆ డబ్బును ఉపయోగించి ఒక పరిశ్రమను స్థాపించడం ద్వారా దివ్యాంగుల ఆర్థికంగా అభివృద్ధి కి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఆ విధంగా ప్రణాళికల రూపొందించి తమ వద్దకు రావాలని సూచించారు. వెంటనే దివ్యాంగులందరూ తమ చప్పట్లతో కలెక్టర్ కు అభినందనలు తెలిపారు. అలానే దివ్యాంగులు మీటింగ్లు నిర్వహించుకోవడానికి తమ పరిధిలోని రైతు వేదికలను ఉపయోగించుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మహిళా, శిశు, మరియు వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రామ్మోహన్, విద్యాశాఖ కోఆర్డినేటర్ సైదులు, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, దివ్యాంగులు, మీసేవ కేంద్రాలు నిర్వహకులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News