చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి 

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి 

లోకల్ గైడ్ తెలంగాణ, వరంగల్ జిల్లా ప్రతినిధి:

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డిబిఎమ్ 54, 57 కాలువ ద్వారా రబి  కాలానికి పంటలకు నీరు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మహబూబ్ నగర్, ఉకల్, ఘట్టికల్, జగన్నాథపల్లి గ్రామాలలో క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి కలెక్టర్ వ్యవసాయ పంట పొలాలను సాగునీరు అందుతున్న తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మైలారం రిజర్వాయర్  బ్యాలెన్సింగ్ ను సందర్శించి నీటి నిలువ సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారాబంది నీటి విడుదల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ చివరి ఆయకట్టు వరకు  రబీ కాలానికి పంట చేతికి వచ్చేవరకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా నీరు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఇరిగేషన్ ఈఈ రమేష్ బాబు, డిఈ కిరణ్ కుమార్, తాహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్ నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News