బహుజనుల గొంతుక అయిన కవితక్క.
లోకల్ గైడ్:
కల్వకుంట్ల కవితక్క బహుజనుల గొంతుక అయి అసెంబ్లీ లో అంబేద్కర్ విగ్రహము పెట్టాలని డిమాండ్ చేసి విగ్రహము ఏర్పాటులో కీలకమైంది. నేడు సావిత్రి బాయ్ ఫూలే ఆశయాలకు అనుగుణంగా మహిళా సాధికారతకై కృషి చేస్తూ మహిళలకు చట్ట సభలలో మూఫ్పై మూడు శాతం రిజర్వేషన్ కై పోరాడుతూ దేశ రాజధాని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపటి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టారు అంటే కవితక్క చేసిన విశేషమైన కృషి అని చెప్పవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ లో కల్పించడంలో కవిత అక్క పాత్ర ఉంది. నేడు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు అండగా నిలుస్తుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కై ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా బీసీ నేతలతో ఉద్యమాలు చేసింది. ప్రతి జిల్లా జిల్లా తిరుగుతూ బీసీలను చైతన్య పరుస్తుంది. కవితక్క జ్యోతి రావు ఫూలే విగ్రహము అసెంబ్లీలో పెట్టాలని పోరాడుతూ ఫూలే దంపతుల ఆశయాలకై శ్రమిస్తూ నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్యన ఉంటూ వారి అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యంగా బద్దంగా పోరాడుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలు ఈనాటికీ ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికై ఉద్యమిస్తుంది. అదే విధంగా బతుకమ్మ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కవితక్క ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరు ఊరు తిరుగుతూ బతుకమ్మ ప్రత్యేకతను తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా రాష్ట్ర పండుగ గుర్తింపు తీసుకు వచ్చి పేదింటి ఆడ పడుచులకు బతుకమ్మ చీరలు పంపీణి చేయిచడంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబురాలు ఘనంగా చేసుకునే విధంగా వీలు కల్పించారు. తెలంగాణ సంస్కృతిక సాంప్రదాయమైన బతుకమ్మ పండుగను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. కల్వకుంట్ల కవితక్క తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయ శంకర్ సార్ ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ అధ్యక్షతన క్రియాశీలకంగా పని చేసింది. కవితక్క ఉన్నత కుటుంబంలో పుట్టిన గర్వం లేకుండా బహుజనుల హక్కులకై పోరాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనకై పోరాడింది ఉద్యమంలో ఎన్ని అక్రమ కేసులైనా ఎవ్వరెన్ని అవహేళనలు చేసిన లాఠీలు విరుచుకుపడిన ఆత్మస్థైర్యం కోల్పోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగమైంది. ఉద్యమ కాలం నుండి ఈనాటి వరకు సమర్థవంతంగా పని చేస్తూ తండ్రికి తగ్గ తనయురాలుగా పేరు సంపాదించుకుంది కవితక్క. అధికారం ఉన్న లేకపోయిన ప్రజల మధ్యనే ఉంటూ అభాగ్యులకు అండగా నిలబడుతుంది. కరోనా సమయంలో సోషల్ మీడియా వేదికగా కరోనా బారిన పడిన వారికి నాణ్యమైన వైద్యం అందించి పేద బహుజనులకు చేరువ అయింది. సమస్యతో అక్కా అంటూ తన ఇంటి తలుపు తట్టిన వారికి నేనున్నాను అంటూ భరోసా నిస్తూ మానవత్వాన్ని చాటుకుంటుంది. దివ్యాంగులకు తన స్వంత ఖర్చులతో వారికి కావాల్సిన పరికరాలు అందించింది. సోషల్ మీడియా వేదికగా అక్క అన్ని సహాయము చేయూత అందిస్తుంది. గల్ఫ్ దేశాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులకు బాసటగా నిలుస్తూ వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్పించిన ఘనత కవితక్కది. తెలంగాణ ఉద్యమ కాలంలో జాగృతిని ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు రాజకీయ అవకాశాలు కల్పించింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ యువకులు కూడా రాజకీయంగా ఎదగాలని జాగృతిలో కమిటీలు వేసి రాజకీయ లక్షణాలు నేర్పించింది. జాగృతి సంస్థ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రతి ఏటా కవితక్క పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయ ప్రవేశాలకు మొదటిలో కవితక్క అమెరికా నుంచి తిరిగి రాగానే కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పేద పిల్లలకు విద్యా, వైద్యం అందించింది. కవితక్క రాజకీయాల్లో రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంది.
Comment List