అంగన్వాడి కేంద్రాలకు ఒక్కపూట బడులు అమలుచేయాలి
లోకల్ గైడ్ తెలంగాణ,కొత్తగూడెం:
అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ బిడబ్ల్యుఓ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి అంగన్వాడి జిల్లా కార్యదర్శి జి పద్మ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం అంగన్వాడీ కేంద్రాలకు అతి తక్కువ చిన్న వయసున్న పిల్లలు ఉంటారని పై గా అంగన్వాడీ కేంద్రంలో ఎటువంటి మౌలిక వసతులు లేవు కరెంటు సౌకర్యం లేదు ఫ్యాన్లు లేవు ఈ నేపథ్యంలో పిల్లలు ఎండల తీవ్రతను తట్టుకోలేరని అందుకే వారికి తక్షణమే ఒక్క పూట బడులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 15 తారీకు నుండి ఒక పూట బడులు నిర్వహించాలని, అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలు అతి తక్కువ వయసున్న పిల్లలు ఎందుకు ఒక్క పూట బడులు మంజూరు చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొగ్గు గనుల ప్రాంతం ఎండల తీవ్రత ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఎండలు విపరీతంగా కొడుతున్నాయని పిల్లల పేరెంట్స్ ఎండలు బాగా ఉన్నాయి పిల్లలకి పంపించడం ఇబ్బంది సౌకర్యాలు మీకేంద్రాల్లో లేవు అని పిల్లలు తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్నారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడి కేంద్రాలకు ఒక్క పూట బడులు మంజూరు చేయాలని, అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.అంగన్వాడీలకు సమ్మె కాలం ఆమీలను అమలు చేయాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 18000 ఇవ్వాలని బడ్జెట్ సమావేశాలు సందర్భంగా ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల మార్చి 17,18 రెండు రోజులు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన దీక్షలు చేపడుతున్నామని ఐసిడిఎస్ డిడబ్ల్యుఓ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ రెండు రోజులు జరిగే నిరసన దీక్షలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అప్ గ్రేడ్ టీచర్స్ అందరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే. సత్య,అంగన్వాడి జిల్లా అధ్యక్షులు ఈ వెంకటమ్మ,అంగన్వాడి జిల్లా ఆఫీస్ బేరెర్స్ మరియ, భానుశ్రీ,హేమలత,రాజ్యలక్ష్మి,అచ్చమ్మ, సావిత్రి, రమ్య, శేషికల, పద్మ,కనక తదితరులు పాల్గొన్నారు.
Comment List