గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.

 4 లక్షల నిధుల మంజూరుతో జిల్లెడ్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.

లోకల్ గైడ్ తెలంగాణ, జిల్లెడ్ చౌదరిగూడెం:

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లేడు చౌదరిగుడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు అన్నారు. సోమవారం మండల పరిధిలోని జిల్లేడు గ్రామంలో చిట్యాల జంగయ్య ఇంటి నుండి బుచ్చయ్య ఇంటి వరకు   సిసి రోడ్డు నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. గ్రామాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా గ్రామాలలో అభివృద్ధి పనులకు భారీ ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నదని గ్రామ ప్రజలతో అన్నారు .గత బిఆర్ఎస్ పార్టీ గ్రామాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా పది సంవత్సరాలు కాలయాపన చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రతి గ్రామంలోని అభివృద్ధి పనులను చేపడుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించి గ్రామస్తులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని గ్రామస్థులను కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లేడు చౌదరిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు, తాలూకా బిసి సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట్ నర్సింహారెడ్డి, మాజీ ఎంపిటిసి సత్యనారాయణ రెడ్డి, పద్మారం మాజీ సర్పంచ్ నర్సింహులు, మండల మాజీ ఎంపీపీ తనయుడు సన్వల్లి ఆంజనేయులు,రవి,కాంగ్రెస్ పార్టీ నాయకులు సలీం, మండల కార్య నిర్వాక అధ్యక్షులు భాస్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెక్యం శశిధర్, వెంగన్న గారి బాలయ్య, మాసాల సత్తయ్య, ఇలిటం ఎల్లేశ్వర్, మద్దూరి జంగయ్య ,మహేష్, కిష్టయ్య జంగయ్య ,గ్రా మాస్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News