ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
లోకల్ గైడ్:
ప్రజవాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.జిల్లా స్థాయితో పాటు, మండల, గ్రామస్థాయి వరకు ఇదే ఒరవడిని పాటించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సోమవారం ప్రజలు పెద్ద ఎత్తున ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ఫిర్యాదులను సమర్పించారు. సుమారు 100 ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులు సమర్పించగా, అందులో ఎప్పటిలాగే వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి,ఆ తర్వాత భూములకు సంబంధించిన ఫిర్యాదులు ,ఇతర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ప్రజావాణి ఫిర్యాదులను సరైన విధంగా పరిష్కరించాలని, ఫిర్యాదుదారులకు ఫిర్యాదు పరిష్కారం పై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, ఒకవేళ పరిష్కారం కానట్లయితే ఎందుకు కావటం లేదో తెలియజేయాలి అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధామ్య పథకాలను ఆయా శాఖల అధికారులు మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. భూములకు సంబంధించిన కేసుల పరిష్కారంలో ఆర్డీవోలు, తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని చెప్పారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు.
Comment List