రైతులకు ఎకరాకు రైతు భరోసా పథకం కింద 15 వేల రూపాయలు ఇవ్వాలి
సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య డిమాండ్
లోకల్ గైడ్/ పరిగి: నేడు సిపిఎం పరిగి ఏరియా కమిటి పరిగి పట్టణంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కె.నర్సమ్మ గారి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 15వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి అధికారంలోనికి వచ్చి ఏడాది అయిన తరువాత నేడు12 వేల రూపాయలు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రకటించడం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ హామీ ప్రకారము 15వేల రైతు భరోసా ఇవ్వాలని, గత సంవత్సరం పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఎకరాకు రైతులతో సమానంగా 15 వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానని హామీ నీటి మూటగానే మిగిలిపోయిందని భూమిలేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో గ్రామాలలో సర్వే చేసి అర్హులను గుర్తించడం సంతోషమే కానీ ఇంటి స్థలం లేని పేదలకు వెంటనే 120 గజాల ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 19 లో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమి పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రోడ్లు లేని గ్రామాలకు వెంటనే బీటీ రోడ్లు వేయాలని, పరిగి పట్టణంలోని సాధన హాస్పిటల్ లో గత మూడు రోజుల కింద గర్భిణీ చనిపోయినా ఘటనపై వెంటనే వైద్యాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఏ హాస్పిటల్ ప్రారంభమైన అధికార పార్టీ ఎమ్మెల్యేల, మాజీ ఎమ్మెల్యేలు ప్రారంభించిన అనంతరం ఆ హాస్పిటల్ లో ఏం జరిగినా,వైద్యం వికటించి హాస్పిటల్ లో చనిపోయిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు.సాధన హాస్పిటల్ లో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.లేకపోతే ఆందోళన తప్పదని అన్నారు.నస్కల్ రోడ్డు మార్గంలో వెంటనే బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గ అభివృద్ధి కొరకు, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమాలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండీ.హబీబ్,ఎహ్.సత్తయ్య, రఘురాం, సీఎహ్.సత్తయ్య, శేఖర్, మొగులయ్య, లాలప్ప, రాంచెంద్రయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List