కామారెడ్డి లో చలివేంద్రం కేంద్రము - ప్రారంబించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు
లోకల్ గైడ్:
టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , ఇంచార్జ్ అదనప కలెక్టర్ చందర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము నందు ఏర్పాటు చేసిన అంబలి చలివేంద్రం కేంద్రమును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డి కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని ,ఇట్టి సందర్భంగా పలు సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం; అంబలి కేంద్రం వల్ల వారి యొక్క దాహం తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు . అదేవిధంగా టిఎన్జీవోస్ ఆద్వర్యంలో చలివేంద్రం,అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు . ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్న టిఎన్జీవోస్ సంఘానికి అభినందనలు తెలిపారు.అనంతరం జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చలివేంద్రం , అంబలి కేంద్రం ను టీఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం టీఎన్జీవోస్ జిల్లా శాఖ యొక్క ఆనవాయితీగా వస్తుందని అన్నారు . ఇట్టి చలివేంద్రం మరియు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్ కు , అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం నాగరాజు, సహాధ్యక్షులు ఎం చక్రధర్, కోశాధికారి ఎం.దేవరాజు,ఉపాధ్యక్షులు యు.సాయిలు, జె. శ్రావణ్ కుమార్, బి లక్ష్మణ్, రాజమణి, బి.రాజేశ్వర్, ఎంసీ పోచయ్య..జాయింట్ సెక్రెటరీలు రమణ, ఖదీర్, రాజమణి ,రాజారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, కల్చరల్ సెక్రెటరీ రాజ్ కుమార్, ఈసీ మెంబర్ శ్రీకాంత్, సాయినాథ్, అశ్వాక్,కామారెడ్డి అర్బన్ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, సృజన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు , ఉపాధ్యక్షులు ఎం కిషన్, TAMSA రాష్ట్ర కోశాధికారి కె శివకుమార్, సమీకృత జిల్లా కార్యాలయపు ఉద్యోగులు పాల్గొన్నారు.
Comment List