డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని ఘనంగా నిర్వహించుకున్న ఐటిడిఎ ,పిఓ బి ,రాహుల్.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని ఘనంగా నిర్వహించుకున్న ఐటిడిఎ ,పిఓ బి ,రాహుల్.

లోకల్ గైడ్:

భారత రాజ్యాంగ రూపశిల్పి, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, భారతీయులకు పరిచయం అవసరం లేని పేరు అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం భారతీయుల గుండెల్లో పదిలంగా ఉంటుందని, ఆయన ఎవరో కాదు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అన్నారు. ఐటిడిఏ సమావేశం మందిరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఐటీడీఏ యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, దళితులు, మహిళలు, కార్మికుల, కర్షకుల, అణగారిన వర్గాల హక్కుల కోసం సామాజిక ,ఆర్థిక, సాధికారత కోసం జీవితాంతం తపించి ఆలు పెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని, దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు, తదితర వర్గాలకు సమన్వయం జరిగేలా అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికి అగ్ర జ్వాలలు పేళ్ళు బూకుతునే ఉందని ,దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం, ఆలు పెరగని పోరాటం చేసిన మహనీయుడని, దళితుల పట్ల నాడు ఉన్న వివక్షల రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని ఆయన అన్నారు. కులాలు అనేది మనం సృష్టించుకున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా అంబేద్కర్ ఆశయాలు ఎవరు మార్చలేరని, బడుగు బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగ కూడదనే ఉద్దేశంతో వారికి కచ్చితమైన సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని దక్కించుకునేందుకు భరోసాని, భవిష్యత్తు ఇచ్చేలా తన ఆరోగ్యం ను లెక్కచేయకుండా భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి  రూపొందించిన మార్గదర్శకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, చదువే మనిషికి మూడో నేత్రమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని గిరిజన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థినీ విద్యార్థులు ఆయన చూపిన మార్గంలో నడవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఏ సి ఎం ఓ రమణయ్య, డీఎస్ఓ ప్రభాకర్ రావు, డి ఈ హరీష్, జీసీడిఓ అలివేలుమంగతాయారు,మేనేజర్ ఆదినారాయణ, మరియు ఐటీడీఏ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .