అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిక 

అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిక 

లోకల్ గైడ్ :

నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి  సమక్షంలో... నల్గొండ మండలం అనంతారం గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 50  కుటుంబాల వారు... ఆ పార్టీకి రాజీనామా చేసి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.కంచర్ల వారందరికీ గులాబీ కండువాలుగా కప్పి సాదర పూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని... ప్రజలు తమను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. వచ్చేస్తానికి సంవత్సరం ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడం ఖాయమని.. అందుకే ప్రజలు.. కెసిఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని భావిస్తూ స్వచ్ఛందంగా పార్టీలో చేరు న్నారని వారందరిని పార్టీ లోకి ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు..ఆర్ శివకుమార్, రుద్రాక్ష సాయి, రుద్రాక్ష స్వామి, ఆర్ కుమార్.. నాయకత్వంలో 50 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారు p సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు పెచ్చు మీరాయని.. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను, పట్టించుకోవడంలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వమ్ము చేసిందని.. ఈ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని.వారి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అందుకే తాము కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో స్వచ్చందంగా చేరుతున్నామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి, గాదె రామ్ రెడ్డి మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, బడుపుల శంకర్.. మామిళ్ళ సైదులు కోట్ల జయపాల్ రెడ్డి.. మునుపాటి  మహేష్, కడారి వెంకన్న సుంకరబోయిన వెంకన్న మేడ సైదులు చెరుకు శ్రీకాంత్ రాజేష్ ఆంజనేయులు చిన్న శివ జయంత్ శ్రీకాంత్ ధోని ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు
దండకారణ్యంలో ఆదివాసులపై సైనికులు యుద్ధం చేయడం అప్రజాస్వామికంకేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలిరాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన ర్యాలీ లోకల్ గైడ్:   తన...
సరికొత్త వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
కామారెడ్డి లో చలివేంద్రం కేంద్రము  - ప్రారంబించిన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు
పిల్లలకు మెరుగైన విద్య మౌలిక వసతులు అందించాలి
ఏ రూపం లో ఉన్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.     
దళిత వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ పార్టీ
Uppal Balu Latest Interview | Uppal Balu unknown truths | Uppal Balu Interview | Lady Aghori