ఉగ్రవాదంపై సిపిఐ ఉవ్వెత్తున నిరసన

దేశ పౌరులపై హత్యాకాండ పిరికిపంద చర్య

ఉగ్రవాదంపై సిపిఐ ఉవ్వెత్తున నిరసన

లోకల్ గైడ్ :
జమ్మూ-కాశ్మిర్ పెహల్గామ్ పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ సిపిఐ  ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం  పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్' నుంచి బస్టాండు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద ఉగ్రదాడిని కండిస్తూ మానవాహారం నిర్మించి నినాదాలు చేశారు, మృతులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ ఉగ్రవాదులు దేశపౌరులపై జరిగిపిన జరిపిన దాడి  హత్యాకాండ పిరికిపంద చర్యని  ఈ చర్యను భారత పౌరసమాజం సహించబోదన్నారు. ఉగ్రవాదానికి మతం ఉండదని  పహాల్గమ్లో హిందూ  ముస్లిం అనే తేడా లేకుండా చంపేశారని  అత్యంత ఘోరమైన మరణహోమాన్ని కూడా రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూసే దుర్మార్గుల పన్నాగాలను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. వారం రోజుల క్రితమే పాకిస్థాన్ సైన్యాధికారు ఉగ్రవాద కమాండర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నప్పటికీ వాటిని పసిగట్టడంలో కేంద్ర బలగాలు ప్రభుత్వం ఎందుకు ఫైఫల్యం చెందారో దేశ ప్రజలకు బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఇంటిలిజెన్స్ సంస్థ దాడుల విషయాన్ని ముందే కేంద్రానికి   ఈ దాడికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు కె సారయ్య జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య  కంచర్ల జమలయ్య  వాసిరెడ్డి మురళి మునిగడప వెంకటేశ్వర్లు ఎస్ కె ఫహీమ్, పొలమూరి శ్రీనివాస్  పట్టణ పార్టీ ప్రజా సంఘాల నాయకులు ధర్మరాజు  యూసుఫ్ బోయిన విజయ్ కుమార్  గొనె మని  మాతంగి లింగయ్య నూనావత్ గోవిందు  ఖయూమ్ జాకబ్  గుత్తుల శ్రీనివాస్  దాట్ల శ్రావణ్  రాంజీ గొనె సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు
దండకారణ్యంలో ఆదివాసులపై సైనికులు యుద్ధం చేయడం అప్రజాస్వామికంకేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలిరాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన ర్యాలీ లోకల్ గైడ్:   తన...
సరికొత్త వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
కామారెడ్డి లో చలివేంద్రం కేంద్రము  - ప్రారంబించిన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు
పిల్లలకు మెరుగైన విద్య మౌలిక వసతులు అందించాలి
ఏ రూపం లో ఉన్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.     
దళిత వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ పార్టీ
Uppal Balu Latest Interview | Uppal Balu unknown truths | Uppal Balu Interview | Lady Aghori