ఎంపీ వద్దిరాజు ఎల్కతుర్తి సభాస్థలి సందర్శన
లోకల్ గైడ్:
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఎల్కతుర్తి సభాస్థలిని సందర్శించారు.బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఈనెల 27వతేదీన జరిగే భారీ బహిరంగసభ కోసం కొనసాగుతున్న పనులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్,రేగా కాంతారావు,పెద్ది సుదర్శన్ రెడ్డి,మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్,జాజాల సురేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి రామకృష్ణ తదితరులతో కలిసి పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాల నుంచి సభకు వాహనాలు వచ్చే మార్గం, వాటిని నిలిపి ఉంచే స్థలం, అనంతరం తిరిగి వెళ్లే రోడ్డు వివరాలను ఎంపీ రవిచంద్ర మ్యాప్ ద్వారా నాయకులు, సమన్వయకర్తలకు వివరించారు.మ్యాప్ ప్రతులను ఎంపీ వద్దిరాజు వారికి అందజేశారు.
Comment List