తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు

తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు

దండకారణ్యంలో ఆదివాసులపై సైనికులు యుద్ధం చేయడం అప్రజాస్వామికం
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన ర్యాలీ

లోకల్ గైడ్:  

తన దేశ పౌరులపైన యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని, దండకారణ్యంలో ఆదివాసులపై సైనికులు యుద్ధం చేయడం అప్రజాస్వామికమని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం శాంతి ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ... మధ్య భారతదేశంలోని దండకారణ్యంలో 'ఆపరేషన్ కగార్' ను వెంటనే ఆపివేయాలని, ఆదివాసులపై జరుగుతున్న మారణహోమాన్ని, దాడిని నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. గత నాలుగు రోజులుగా కర్రిగుట్టలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారా మిలిటరీ బలగాలు వివిధ రాష్ట్రాల బలగాల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న ఆపరేషన్ను వెంటనే వెనక్కి పంపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మన్నారు. తన దేశ పౌరులపైన యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని దేశ సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి సైనికులు దండకారణ్యంలో ఆదివాసులపై యుద్ధం చేయడం అప్రజాస్వామీకం అన్నారు. మరొక ప్రక్క ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే మావోయిస్టులు ప్రకటించారు కానీ ప్రభుత్వ వైపు నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడం వెనుక కార్పొరేట్ శక్తులు, బహుళ జాతి కంపెనీలు ఉన్నాయన్నారు. ఈ దేశ సంపదను కాపాడుకోవడం కోసం ఆదివాసులకు మద్దతుగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త రవి మారుత్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి విక్రమ్, ఎర్ర శ్రీనివాస్, సిపిఐ జిల్లా నాయకులు సింగు నరసింహారావు, పోటు కళావతి, శివరామకృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, సర్దార్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యదర్శి స్వర్ణ సుబ్బారావు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి నాగరాజు, తెలంగాణ పీపుల్ జేఏసీ జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి విజయ్, జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి చిర్ర రవి, జిల్లా నాయకులు కె.వెంకటేశ్వర్లు, టిపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర నాయకులు బాబురావు, తాళ్లూరు వేణు, రాష్ట్ర నాయకులు విజయ్, సామాజిక ఉద్యమకారులు అరవపల్లి విద్యాసాగర్, గుంతేటి వీరభద్రం, పేల్లూరి విజయ్ కుమార్, బీసీ సంఘం నాయకులు పెరుగు వెంకటరమణ, విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు అజిత్ పాషా, నరేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మస్తాన్, దాసరి శ్రీను, దశరథ చావ రమేష్, రవి, సుభాను, కళ్యాణం వెంకటేశ్వరరావు, పరకాల లక్ష్మి, గాంధీ, మోహన్ రావు, ముస్లిం జేఏసీ నాయకులు అబ్దుల్ రెహమాన్,పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు
దండకారణ్యంలో ఆదివాసులపై సైనికులు యుద్ధం చేయడం అప్రజాస్వామికంకేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలిరాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన ర్యాలీ లోకల్ గైడ్:   తన...
సరికొత్త వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
కామారెడ్డి లో చలివేంద్రం కేంద్రము  - ప్రారంబించిన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు
పిల్లలకు మెరుగైన విద్య మౌలిక వసతులు అందించాలి
ఏ రూపం లో ఉన్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.     
దళిత వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ పార్టీ
Uppal Balu Latest Interview | Uppal Balu unknown truths | Uppal Balu Interview | Lady Aghori