రాణించిన రైజర్స్‌.. చపాక్ లో ఘనవిజయం

రాణించిన రైజర్స్‌.. చపాక్ లో ఘనవిజయం

లోకల్ గైడ్:

చెన్నైది అదే కథ వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్‌-18లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తిరిగి విజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సమిష్టిగా రాణించిన సన్‌రైజర్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదుచేసింది.రైజర్స్‌ అదుర్స్‌.. చెపాక్‌లో చెన్నైపై తొలి విజయం మెరిసిన హర్షల్‌, ఇషాన్‌, కమిందు.చెన్నై: వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్‌-18లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తిరిగి విజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ సమిష్టిగా రాణించిన సన్‌రైజర్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదుచేసింది. చెపాక్‌లో చెన్నైపై సన్‌రైజర్స్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్దేశించిన 155 పరుగుల ఛేదనను ఆ జట్టు.. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 44, 5 ఫోర్లు, 1 సిక్స్‌), కమిందు మెండిస్‌ (22 బంతుల్లో 32 నాటౌట్‌, 3 ఫోర్లు) రాణించారు.
మొదట హైదరాబాద్‌ బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై.. 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్‌ అయింది. హర్షల్‌ పటేల్‌ (4/28), పాట్‌ కమిన్స్‌ (2/21), జయదేవ్‌ ఉనద్కత్‌ (2/21) ఆతిథ్య జట్టును భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఈ సీజన్‌లో చెన్నైకి తొలి మ్యాచ్‌ ఆడుతున్న డెవాల్డ్‌ బ్రెవిస్‌ (25 బంతుల్లో 42, 1 ఫోర్‌, 4 సిక్సర్లు), అయుశ్‌ మాత్రె (19 బంతుల్లో 30, 6 ఫోర్లు) సీఎస్‌కేను ఆదుకున్నారు. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది ఆడిన 9 మ్యాచ్‌లకు గాను ఏడో ఓటమి. ఈ ఫలితంతో ప్లేఆఫ్‌ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా నిష్క్రమించినట్టే.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి *ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి *ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా...
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ