అంబేద్కర్ ఆశయ సిద్ది కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.
నల్లగొండ జిల్లా బ్యూరో .
లోకల్ గైడ్:
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగానల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మర్రిగూడ బైపాస్ రోడ్ లో, డీఈఓ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. డీఈఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమంలోపలువురు దళిత నాయకులు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సిద్ది కోసం ప్రయత్నం చేయాలని కోరారు.ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని కెసిఆర్ హైదరాబాదులో ఏర్పాటు చేశారని, నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టారని, దళితుల కోసం అనేక పథకాల ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి దోహదపడ్డారని, ముఖ్యంగా 10 లక్షల రూపాయల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళిత కుటుంబాలన ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేశారని కొనియాడారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించి దళితుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అదేవిధంగా ఇప్పటికే 1100 మందికి నల్గొండ నియోజకవర్గంలో దళిత బందు మంజూరి ప్రొసీడింగ్స్ ఇచ్చామని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని నిలుపు వేసిందని వెంటనే ప్రొసీడింగ్ ఇచ్చిన దళితులందరికీ దళిత బంధు కింద పది లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాలో వెంటనే జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్ నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,మైనం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, మాజీ కౌన్సిలర్ గున్రెడ్డి యుగంధర్ రెడ్డి, మాతంగి అమర్ బిపంగి యాదయ్య, కందుల లక్ష్మయ్య,పేర్ల అశోక్, వింజమూరు లక్ష్మణ్, బీపంగి కిరణ్, దొడ్డి రమేష్, సతీష్, నాగయ్య, ఖతర్నాక్, తదితరులు పాల్గొన్నారు...
Comment List