ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ 134 వ జయంతి వేడుకలు నివాళులర్పించిన

  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ 134 వ జయంతి వేడుకలు నివాళులర్పించిన

లోకల్ గైడ్ న్యూస్ :

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్  జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాల సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ 134 వ జయంతి సందర్భంగా  సోమవారం వనపర్తి పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశంలో ఆనాటి కాలములో ఉన్న అస్పృశ్యత్య, అంటరానితనపై అలుపెరుగని పోరాటం చేయడమే కాకుండా భావి భారతదేశం ఏ విధంగా  ఉండాలో ఊహించి ప్రపంచం మెచ్చిన భారత రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. కేవలం విద్య ద్వారానే సమాజంలో గౌరవం ఆర్థిక సమానతలు సాధించవచ్చని చాటి చెప్పారని కొనియాడారు. అంతటి మహనీయుడు ప్రతి ఒక్కరికి స్పూర్తి ప్రదాత అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఏడీ మల్లికార్జున రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం గట్టయ్య, సంఘ నాయకులు  గంధం నాగరాజు, రాజా రామ్   తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .