వంగూరి వాచకం -నవరత్నాలు
లోకల్ గైడ్:
వంగూరి వాచకం -నవరత్నాలు
1.ఎంత చక్కెర బుక్కినా
చీమలకు రాదు మధుమేహం
నిరంతర నడకే
రోగనిరోధక వ్యూహం
2.ఎవరున్నా లేకున్నా
ఒకేలా ప్రవర్తించలేవా నువ్వు
ఎవరు చూసినా చూడకపోయినా
ఒకేలా వికసించదా పువ్వు
3.ఎంత పెద్ద సమస్యనైనా
చిన్న ఆలోచన చేయు సులువు
లంకంత ఇంటి తలుపుకైనా
తాళంచెవే కదా ఆయువు
4.పరాజుతుడి బలహీనతలు
విజేతకు కలిసొచ్చే బ్రహ్మాస్త్రాలు
అసంఖ్యాక కర్ణుడి శాపాలు
విజయుడకి కాలేదా విజయ సూత్రాలు
5.బలమే విలువైనదని
భ్రమ పడితే ఎలా
కండలు తిరిగిన వీరుడైన
వార్ధక్యం వాయిదా వేయగలడా
6.కొడుకులు కలుగలేదనే
మనోవ్యధను మట్టుపెట్టు
శతసుతుల ధృతరాష్ట్రునికి
ఒక్కరైనా మిగిలిరా కొలివిపెట్ట
7.జంతువులంటే
అంత చులకన ఎందుకు
అవే కదా వాహనాలై
దైవాలను నడిపిస్తాయి ముందుకు
8.ధనవంతుడను నాకేమని
విర్రవీగితే ఎలా చెప్పు
బలవంతుడైన సూర్యుడికైనా
తప్పునా గ్రహణం ముప్పు
9.కళ్ళెందుకు చూడాలి
చేతులు ఎందుకు చేయాలంటే ఎలా దేహానికైనా దేశానికైనా
సమన్వయంతోనే సమగ్రత కదా.
వంగూరి గంగిరెడ్డి
9652286270
షాద్ నగర్
Comment List