ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌

భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో  భారీ ఎన్‌కౌంటర్‌

లోకల్ గైడ్:

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్. 28 మంది మావోయిస్టులు మృతి  తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌ ఏప్రిల్ 26 : తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టలో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఐదు రోజులుగా కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మావోయిస్టు మోస్ట్‌ వాంటెడ్‌ కీలక నేతలు హిడ్మా, దేవా టార్గెట్‌గా జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో మూడు రాష్ట్రాల నుంచి 20 వేల మందికి పైగా బలగాలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మరణించారని సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కర్రెగుట్టలో సుమారు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. గుట్ట సమీపంలోని ప్రజలు బయటకు రావద్దని ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇక మావోయిస్టుల కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా డ్రోన్ల సాయంతో ఏజెన్సీని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజననులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, భద్రతా సిబ్బందికి 8 హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, భోజనాలు, నీటిని సరఫరా చేస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు
దండకారణ్యంలో ఆదివాసులపై సైనికులు యుద్ధం చేయడం అప్రజాస్వామికంకేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలిరాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన ర్యాలీ లోకల్ గైడ్:   తన...
సరికొత్త వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
కామారెడ్డి లో చలివేంద్రం కేంద్రము  - ప్రారంబించిన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు
పిల్లలకు మెరుగైన విద్య మౌలిక వసతులు అందించాలి
ఏ రూపం లో ఉన్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.     
దళిత వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ పార్టీ
Uppal Balu Latest Interview | Uppal Balu unknown truths | Uppal Balu Interview | Lady Aghori