జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ఠ నిఘా, ప్రత్యేక బృందాలు ఏర్పాటు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.

జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ఠ నిఘా, ప్రత్యేక బృందాలు ఏర్పాటు.

లోకల్ గైడ్ :

మీ ఇంటి పరిసరాల్లో,కాలనీల్లో మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీటీవీ  కెమెరాల ప్రాముఖ్యత ఎంతో ముఖ్యం ముఖ్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు శనివారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలి,వెంటనే తగు సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ కి  అందించాలని కోరారు.వేసవి కాలం సెలవులు ప్రారంభం అయినవి పెళ్లి ముహుర్తాలు, మరియు వేసవి కాలం స్నేహితుల తో మరియు ఫ్యామిలీ మెంబర్స్ అంతా టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు.  ఇదే అదునుగా దొంగతనాలకు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని జిల్లా ప్రజలు కూడా ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.  జిల్లాలో దొంగతనాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ఠ నిఘా ఏర్పటు చేసి అన్ని ప్రాంతాలలో నిఘా పెట్టి నియంత్రణ చర్యలు చేపట్టామని అన్నారు.మీ ఇంటి పరిసరాల్లో, కాలనీల్లో,షాపులలో  సిసిటివి కెమెరాలు అమర్చుకోవడం చాలా ముఖ్యమని, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల కదలిక పై తగు చర్యలు తీసుకునుటకు వీటి ప్రాముఖ్యత చాలా అవసరం ఉంటుందని అన్నారు.కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో కాలనీల్లో,షాపులలో మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దొంగతనాల నియంత్రణ  జిల్లా ప్రజలు ఈ దిగువ తెలియజేసిన నిబoధనలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించగలరని కోరారు.ఇంటి బయట, డాబాల పైన పడుకునేవారు తమరి మెడలో నగలని జాగ్రత్తగా పెట్టుకోండి మరియు ఇంటిలో బంగారు ఆభరణాలు ఉంచకండి. బసుల్లో ప్రయాణాలలో మీ బ్యాగ్ను మీ పైన ఉంచుకొని గట్టిగపట్టుకొని వెంట అంటిపెట్టుకోండి, గుర్తు తెలియని వ్యక్తులు తిను బండరాలు, కూల్డ్రింక్స్ లాంటివి ఇస్తే తినకండి తీసుకోకండి.మీరు ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు మరియు బంగారం ఆభరణాలు పెట్టకండి వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం.బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ, బీరువాలోని బట్టల క్రింద. ఇంట్లో పెట్టి వెళ్లవద్దు. వాహనాలను ఇంటి వద్దనే పార్క్ చేసి తాళం చెవులు వెంట తీసుకుని వెళ్తే మంచిది.ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి గేటు బయట గొళ్ళెం పెట్టకండి.ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు, తాళం కనపడకుండా కర్టెన్స్ వేయాలి.ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి. బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి.బయటకు వెళ్ళేపుడు ఇంట్లో మరియు బయట లైట్ వేసి ఉంచండి. పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి. నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే నియమించుకోండి. మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు, వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్త. వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిది. మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది, భద్రత ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటికి సీసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని డీవీకే  రహస్య ప్రదేశాలలో భద్రపర్చుకోవాలి. మరియు మొబైల్ యాప్ ద్వారా సీసీకెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది. మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయకండి.మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి అని కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు
దండకారణ్యంలో ఆదివాసులపై సైనికులు యుద్ధం చేయడం అప్రజాస్వామికంకేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలిరాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన ర్యాలీ లోకల్ గైడ్:   తన...
సరికొత్త వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
కామారెడ్డి లో చలివేంద్రం కేంద్రము  - ప్రారంబించిన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు
పిల్లలకు మెరుగైన విద్య మౌలిక వసతులు అందించాలి
ఏ రూపం లో ఉన్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.     
దళిత వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ పార్టీ
Uppal Balu Latest Interview | Uppal Balu unknown truths | Uppal Balu Interview | Lady Aghori