దళిత వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ పార్టీ
లోకల్ గైడ్:
దళిత వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ అన్నారు. శనివారం గద్వాల పట్టణంలోని డికె.బంగ్లాలో అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సదస్సు (సెమినార్) బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్, బిజెపి యువ నాయకురాలు డికె. స్నిగ్దా రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తుందన్నారు. ఒక్క బీజేపీ పార్టీనే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఎన్నికల్లో రెండు సార్లు ఓడించి అవమానించిందన్నారు. ప్రత్యేకంగా నెహ్రూ, అంబేద్కర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసారని, అంబేద్కర్ కు భారత రత్న పురస్కారం ఇవ్వకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో అంబేద్కర్ పోటో పెట్టకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు.బీజేపీ పార్టీ పూర్వపు జనసంఘ్ మద్దతుతో అంబేద్కర్ పార్లమెంట్ కుఎన్నికయ్యారు. అంబేద్కర్ కు భారత రత్న పురస్కారం ఇచ్చి గౌరవించింది బీజేపీ పార్టీ అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఆయన పోటో పెట్టింది బీజేపీ పార్టీ అంబేద్కర్ కు సంబదించిన ఐదు స్థలాలను ఆయన పుట్టిన స్థలం లండన్ లో ఆయన చదువుకున్న స్థలం ఆయన మరణించిన స్థలం ఆయన చివరి రోజుల్లో గడిపిన స్థలం ఆయన బౌద్ధమతం స్వీకరించిన, స్థలాలను పంచతీర్తాలుగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి భావిభారత పౌరులకు ఆయన చరిత్ర తెలుసుకునే విధంగా అంబేద్కర్ స్మారక చిహ్నాలు, మ్యూజియంలు ఏర్పాటు చేసింది బీజేపీ పార్టీ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి ఎన్నికల అధికారి విద్యా సాగర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట రాములు, అక్కల రమాదేవి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవా దాస్, అసెంబ్లి కి పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివా రెడ్డి, ఈ కార్యక్రమ జిల్లా ఇంచార్జి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, దేవా దాస్, కుమ్మరి శ్రీను, kk రెడ్డి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Comment List