శిధిలావస్థలో  శివాలయం 

గుడి పునర్నిర్మాణానికి అనుమతులు ఎప్పుడు

శిధిలావస్థలో  శివాలయం 

దాతలు సహకరిస్తామన అనుమతులు ఇవన్నీ దేవదాయ శాఖ 

లోకల్ గైడ్ :
పదంతోస్తుల భవనాలకు అనుమతులు ఇస్తారేమో కానీ ప్రభుత్వం.. దేవుడి గుడి పునర్నిర్మానానికి  అనుమతి ఇవ్వటం లేదు. దేవాదాయ  శాఖ పరిధిలో ఉన్న కొత్తగూడెం గాజులరాం బస్తి నందు ఉన్న శ్రీ పాండురంగ భజన మందిరంలోని శివాలయం శిధిలవస్తులో ఉన్నది. 4000 పైచిలుకు సంవత్సరాల క్రితం షోలమహారాజులు పాల్వంచ ప్రాంతంలో ఈ శివలింగాన్ని  ప్రతిష్టించి అనంతరం కాలగర్భంలో కలిసి భూమి లోపల దొరికిన అతి  పురాతన ఎంతో విశిష్టత కలిగిన వినాయకుడు, శివలింగం,నందీశ్వరుడు  విగ్రహాలను 1940లో సింగరేణి సంస్థ కొత్తగూడెం గాజులు బస్తీ నందు ఆలయం నిర్మించింది. అప్పటినుంచి భక్తుల పూజలతో దేవాలయం వైభవపీతంగా కొనసాగుతుంది.1970లో దేవదాయ శాఖ ఆలయాన్ని వారి పరిధిలోకి తీసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు గుడి శిథిలావస్థకు చేరుకొని,  చాలాసార్లు  అర్చకులు పై గర్భగుడిలోని స్లాబ్ పెచ్చులు ఊడిపడి గాయాల పాలన సంఘటన కూడా ఉన్నాయి. ఇప్పటికైనా దేవదాయ శాఖ అధికారులు స్పందించి ఆలయ పునర్నిర్మాణాని చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. దేవదాయ శాఖ అనుమతులు ఎప్పుడు. ఆలయ పునర్నిర్మాణానికి కోసం గత 15 ఏళ్ల నుంచి  భక్తులు, ఆలయం నిర్మించడానికి ముందుకు వచ్చే దాతలు, అర్చకులు ఎన్నిసార్లు అనుమతుల కోసం దేవాదాయ శాఖకు  వినతి పత్రం ఇచ్చిన స్పందించడం లేదు. అసలు దేవదాయ శాఖ నిర్మించాల్సిన ఆలయాని, దాతలు ముందుకు వచ్చిన ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో అర్థం కానీ ప్రశ్నలు ఎన్నో అని ఆశ్చర్యం కలగక మానట్లేదు.ఆలయ ఈవో సులోచన వివరణ  అనుమతుల కోసం దేవదాయ కమిషనర్ కు దాతల హమీతో కూడిన  లిఖితపూర్వక లేఖను   పంపించాం. కొద్దిరోజులు అనుమతులు వస్తాయి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .