నేడే SRH vs LSG మ్యాచ్... 500 పరుగులు దాటే అవకాశం?
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరుగునుంది. భారీ రన్స్ చేయడంలో హైదరాబాద్కు పెట్టింది పేరుగా మారిపోయింది. మొదటి బ్యాటింగ్ చేస్తే కచ్చితంగా 250 కి పైగా పరుగులు చేయడం SRH నైజం. అదే చేజింగ్ లో అయితే 10 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదిస్తుంది. దీంతో ప్రత్యర్థుల జట్టులో వణుకు పుడుతుంది. ఐపీఎల్ 18వ సీజన్లో మొదటి మ్యాచ్ లోనే 286 భారీ పరుగులు చేసింది. అదే ఊపుతో నేడు LSG తో తలపడునుంది. మొదటి మ్యాచ్ ఓడిన లక్నో ఇవాళ జరిగే మ్యాచ్ లోనైనా గెలవాలనే పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తుంది. హైదరాబాద్ జట్టులోని ప్లేయర్స్ అందరూ కూడా అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే పరుగులు చేయడంలో బ్యాటర్స్... బౌలింగ్ వేయడం ప్రారంభించిన వెంటనే వికెట్లు తీయడం SRH కి ప్లస్ గా నిలుస్తుంది. మరోవైపు లక్నో బ్యాటింగ్లో అదరగొడుతుంది. కానీ బౌలింగ్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మరి ఇవాళ ఏ జట్టు గెలుస్తుందో కింద కామెంట్ చేయండి.
Comment List