ఐపీఎల్ ప్రారంభం.... బెట్టింగ్ మీద నిఘా పెట్టిన పోలీసులు

ఐపీఎల్ ప్రారంభం.... బెట్టింగ్ మీద నిఘా పెట్టిన పోలీసులు

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025,  18వ సీజన్ ఈ రోజు నుండి ప్రారంభం కారుంది. కాబట్టి దేశంలోని ప్రతి పోలీస్ అధికారి కూడా అప్రమత్తమయ్యారు. ఐపీఎల్ మ్యాచ్స్ ఈరోజు నుంచి జరుగుతుండగా చాలామంది బెట్టింగ్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు నుండి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం వెంటాడుతుంది. నగరాలతో పాటు మారుమూల గ్రామాలలోనూ సైతం యువతను  బెట్టింగ్ లోకి లాగడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పోలీసులు అన్నిచోట్ల పటిష్టమైన నిఘాను  ఏర్పాటు చేశారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఆయా నియోజకవర్గాలు మరియు మండలాలకు సంబంధించి పోలీసు అధికారులకు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యువత బెట్టింగ్ జోలికి వెళ్లొద్దంటూ హెచ్చరిస్తున్నారు.  బెట్టింగ్ లో నష్టపోయిన లేదా లాభపడిన ఈ విషయాలు మాకు తెలిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ కు పాల్పడినట్టు మాకు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జైలు శిక్ష కూడా విధిస్తామని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.images (22)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్