జిబ్లీ ఫొటోను ఎలా చేయాలో నేర్చుకోవాలి....
లోకల్ గైడ్ :
సాంకేతికంగా ఏదైనా కొత్తది వచ్చిందంటే చాలు నెటిజన్లు దాన్ని అంత ఈజీగా వదలరు కద.. మొన్నటి వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫొటోలను సృష్టించి వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జిబ్లీ వంతు వచ్చింది. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేసినా జిబ్లీ స్టైల్ ఇమేజ్‌లే దర్శనమిస్తున్నాయి.చాట్‌జీపీటీలో ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చిన ఇమేజ్ జెనరేటర్ ‘జీబ్లీ’ స్టూడియో. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభిస్తున్నది. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్.. ఇలా దేంట్లో చూసినా జిబ్లీ ఫొటోలే కనిపిస్తున్నాయి. యూజర్లు తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇతరుల ఏఐ జనరేటెడ్ చిత్రాలతో సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాఫొటోను జిబ్లీ స్టైల్‌లో సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో మహీందా ఓ బైక్‌పై వెళ్తున్నట్లు సృష్టించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ ఫొటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటూ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి.
Comment List