హిందువుల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం యోగి!.
లోకల్ గైడ్,ఆన్లైన్ డెస్క్ :- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందువుల భద్రత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మతాలవారు చాలా భద్రతగా ఉన్నారని సీఎం యోగి అన్నారు. అయితే హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలు కూడా సురక్షితంగానే ఉంటారు అని చెప్పుకొచ్చారు. ఒక వంద మంది హిందూ కుటుంబాల మధ్య ఒక ముస్లిం కుటుంబం చాలా భద్రతగా ఉండగలదు అని స్పష్టం చేశారు. కానీ అదే 100 ముస్లిం కుటుంబాల మధ్య కనీసం 50 మంది హిందువులు సేఫ్ గా ఉండగలరా అని సవాల్ విసిరారు.. దీనికి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ దేశాలే నిదర్శనం అని అన్నారు. మీరు గమనించినట్లయితే ఆఫ్గానిస్థాన్ లోని హిందువులు ఏమయ్యారో?.. ఒకసారి ఆలోచించాలని అన్నారు. కాబట్టి పక్క దేశాలలో జరుగుతున్న తప్పులు మన దేశంలో జరగకూడదు అని స్పష్టం చేశారు. కాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందువులపై ఏమైనా దాడులు జరిగితే అసలు సహించబోరు. అత్యధిక హిందువుల భక్త జనసంద్రం ఉన్న దేశం మన భారతదేశం అని చెప్పారు.
Comment List