' ఐ లవ్ UK '... అన్న సీఎం మమతా బెనర్జీ... విమర్శిస్తున్న నెటిజన్లు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు . పెట్టుబడుల కోసం లండన్ వెళ్లిన మమతా బెనర్జీ అక్కడి పాలకులను కీర్తించింది. భారతీయ ముఖ్యమంత్రి అయ్యి ఉండి లండన్ వెళ్లి వాళ్లను కీర్తించడమేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఐ లవ్ యూ కె... మీకు, మాకు చారిత్రక అలాగే వారసత్వ అనుబంధం కూడా ఉంది. దాదాపుగా 190 ఏళ్లు పాటు మీరు భారతదేశాన్ని పాలించినప్పుడు కోల్కతా నే మీ రాజధాని అని మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాలో మీరు నిర్మించిన హెరిటేజ్ బిల్డింగ్స్ ను నేను ఇప్పటికీ ప్రతిరోజు తలుచుకుంటా అని మమతా బెనర్జీ లండన్ లో ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అయితే ఈ మాటలు విన్న భారతీయ సిటిజన్స్... సోషల్ మీడియా వేదికగా మమత బెనర్జీ పై తీవ్రంగా మండిపడ్డారు. అది వాళ్ళ సొంత డబ్బేం కాదని... మన మాన, ధన, ప్రాణాలను దోచుకుని వాళ్ళు ఇష్టంగా కట్టుకున్నవే అని కామెంట్లు చేస్తూ.. మమతా బెనర్జీ పై మండిపడుతున్నారు.
Comment List