RCB vs GT... తీవ్ర విమర్శలు పాలవుతున్న ఆర్సిబి
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న రాత్రి ఆర్ సి బి మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. అయితే ఈ మ్యాచ్లో చివరికి గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులను నమోదు చేసింది. లివింగ్ స్టోన్ మరియు టీమ్ డేవిడ్ మినహా ప్రతి ఒక్కరు కూడా సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇక అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ రెండు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేదించి విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తరఫున కెప్టెన్ గిల్ వెంటనే అవుట్ అయిన సాయి సుదర్శన్ మరియు జోష్ బట్లర్ అద్భుతమైన బ్యాటింగ్తో చివరి వరకు తీసుకువచ్చి విజయాన్ని అందించారు. సాయి సుదర్శన్ చివరిలో 49 పరుగుల వద్ద అవుట్ అయిన తరువాత ఇంపాక్ట్ ప్లేయర్ కింద రూథర్ఫోర్డ్ వచ్చి మ్యాచ్ ముగించేశాడు. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగగా బెంగళూరు ఓడిపోయిన వెంటనే ఫ్యాన్స్ అందరు కూడా చాలా అసహనం వ్యక్తం చేశారు. మొదటి రెండు మ్యాచ్లు చాలా సులభంగా నెగ్గి హోమ్ టీంలో ఇలా ఆటడమేంటని ఆర్సిబి సోషల్ మీడియా వేదికగా బెంగళూరు జట్టుపై కోపాన్ని చూపిస్తున్నారు. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే ఆలోచనతో ఈ సీజన్లో మొదటి రెండు మ్యాచ్లలో విజయాన్ని పొందిన కూడా మూడో మ్యాచ్లో మాత్రం పరాజయం పాలయ్యారు.
Comment List