దేవస్థానం  ఆదాయం ఆలయ అభివృద్ధికా..?కమిటీల కా..?    

దేవస్థానం  ఆదాయం ఆలయ అభివృద్ధికా..?కమిటీల కా..?    

- పాత, కొత్త కమిటీలు గ్రామస్తులకు లెక్కలు చెప్పకపోవడానికి ఆంతర్యం ఏంటి..?
- ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోని దేవాలయం ఆదాయం, ఆలయ అభివృద్ధికి తోడ్పడే విధంగా చూడాలి

 వరంగల్ జిల్లా ప్రతినిధి ( లోకల్ గైడ్ తెలంగాణ): వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కళ్యాణం, పట్నాలు ఒగ్గు పూజారులచే నిర్వహించబడును. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంక్రాంతి కూడా జాతర నిర్వహించడం జరిగినది. అయితే ఈ ఆలయానికి గత పది సంవత్సరాల నుండి గ్రామంలోని పెద్దలచే కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలోజాతర నిర్వహించడం జరుగుతుంది. గడచిన పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం చేత బీఆర్ఎస్ నాయకులే కమిటీ అధ్యక్షునిగా కొనసాగినారు కానీ ఆలయానికి సంబంధించిన లెక్కలు గ్రామానికి, గ్రామ ప్రజలకు తెలియపరచలేదు. గత సంవత్సరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలోని కాంగ్రెస్ పెద్దలు కమిటీ కోసం ఎమ్మెల్యే దగ్గర కుస్తీ పడి బీఆర్ఎస్ నాయకులతో గొడవపడి కాంగ్రెస్ పార్టీ నాయకున్ని కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకొని  కాంగ్రెస్ నాయకులు కమిటీ సభ్యులుగా రెండు సంవత్సరాల నుండి కొనసాగుతున్నారు. వారు కూడా ఆలయానికి సంబంధించిన లెక్కలు గ్రామ ప్రజలకు తెలియపరచలేదు. కనీసం ఈ సంవత్సరం ఒగ్గు పూజారులకు ఇచ్చే వాటా విషయంలో కూడా స్పష్టత లేకుండా వారికిచ్చే వాటా మొత్తం కూడా ఇవ్వలేదనే ఆరోపణ కూడా గ్రామస్తుల నుండి వినబడుతున్నది. ఈ సంవత్సరం ఉగాది పర్వదినం రోజు కూడా దేవాలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయకుండా,భక్తులు అసౌకర్యాల నడుమ  భక్తులు దర్శనం చేసుకుంటుంటే మళ్లీ ఒగ్గు పూజారులే కలగజేసుకొని ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఇప్పటికైనా వర్ధన్నపేట ఎమ్మెల్యే  కలగజేసుకొని కొత్త కమిటీని నియమించేటప్పుడు ఎంత శ్రద్ధ చూపారో అదే విధంగా  దేవుని సొమ్మును దేవుని ఆలయ అభివృద్ధికి చెందే విధంగా గ్రామస్తులకు లెక్కలు చూపి ఆలయ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు,భక్తులు వేడుకుంటున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News