సర్వాయి పాపన్న 315 వ వర్ధంతి
నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , టీజీఐ ఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
లోకల్ గైడ్ :
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 315 వ వర్ధంతి సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం లో పాపన్న విగ్రహం వద్ద. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కలెక్టర్ వల్లూరి క్రాంతి , టీజీఐ ఐసీ చైర్మన్మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న 1650 ఆగస్టు 18న జనగామ జిల్లా, ఖిలా షాపూర్ సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబంలో జన్మించి, ఆనాడు జరుగుతున్న మొగుల్ పాలకుల అన్యాయాలకు అరాచకాలకు వెట్టిచాకిరి విముక్తికి, పన్నుల వసూళ్ల వ్యతిరేకానికి, పోరాడి, 12 మంది తన స్నేహితుతో కలిసి పోరాటానికి నాంది పలికి 12,000 మంది సైన్యంతో. దక్కన్ ప్రాంతంలో, సుమారు 21 కోటలు నిర్మించి. కిలాషాపూర్ హుస్నాబాద్, హుజూర్నగర్, తాటికొండ కొలపాక బోనగిరి కోట వరంగల్ కోట, అనేక కోటలు నిర్మించి యుద్ధంలో అనేక విజయాలు సాధించి చివరికి గోల్కొండ కోటను ఏడు నెలల పాటు పాలించిన మొట్టమొదటి బహుజన రాజ్యాన్ని స్థాపించిన తెలుగు చక్రవర్తి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని వారు గుర్తు చేశారు. సామాన్యుడు కూడా రాజు కావచ్చు అని స్ఫూర్తిని చూపి, శివాజీ మహారాజ్ తో సమకాలికులుగా ఎదిగిన పాపన్న అని వారు అన్నారు ఆయన పాలనలో 12 ఆరకలతోవరకు సమిష్టి వ్యవసాయం చేసి దక్కన్ ప్రాంతమంతా సస్యశ్యామలం చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని, చెక్ డ్యాములు ఎల్లమ్మ దేవాలయాలు నిర్మించి బ్రాహ్మణిద్యాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని వారు అన్నారు. 1709లోఇది జీర్ణించుకోలేని మొగలాయిలు భూస్వాములు కుట్ర చేసి చంపడానికి పూనుకుంటే శత్రు చేతుల్లో చావద్దని ఆయన చేతిలో ఉన్న భాషను పైకెత్తి ఏదో చాటి వీర మరణం పొందిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని వారు గుర్తు చేశారు. వారి సేవలను వారి చరిత్రను. కనుమరుగు చేసే కుట్ర చేసినప్పటికీ, జానపద కళాకారులు రచయితలు కళా రూపంలో పాటలు పాడారని కర్ణాటక బళ్లారిలో ఒక బోయ వాడి పాట ఆధారంగా ప్రముఖ జానపద పరిశోధకుడు పాపన్న చరిత్ర ప్రాచీరం పొందిందని,లండన్ లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో సర్వాయి పాపన్న చిత్రం ఉంది. అలాగే లండన్ లోని కే బ్రిడ్జి యూనివర్సిటీ రీఛార్జ్ ఎం ఈ టెన్ వ్రాసిన ఏ సోషల్ హిస్టరీ ఆఫ్ ద దక్కన్ ఎయిట్ ఇండియన్స్ లిప్స్ అనే పుస్తకాన్ని ప్రచురించి కవర్ పేజీలో పాపన్న చిత్రపటాన్ని ప్రచురించారని వారు గుర్తు చేశారు.ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో గౌడ కులస్తుల, మరియు కల్లు గీత కార్మికుల సమస్యలు పైన జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు ఆశన్న గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్. గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. జిల్లా కమిటీ సభ్యులు రవి గౌడ్ యాద గౌడ్ విట్టల్ గౌడ్. వంశీ గౌడ్, బీరయ్య యాదవ్ అతిమల మాణిక్యం. అశోక్. మాజీ జెడ్పిటిసి మల్ల గౌడ్. మాజీ సి డి సి చైర్మన్ ప్రభు గౌడ్ డాక్టర్ రాజు గౌడ్. కల్లుగీతకార్మిక సంఘం సంగారెడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షుడు కృష్ణ గౌడ్ కార్యదర్శి హరీష్ గౌడ్, శేఖర్ గౌడ్, రామా గౌడ్, వెంకటేశం గౌడ్ పవన్ గౌడ్ మనీష్ గౌడ్ కుమార్ గౌడ్ శ్రీధర్ గౌడ్ రవి గౌడ్. తదితరులు పాల్గొన్నారు.
Comment List