ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం

ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం

లోకల్ గైడ్ :
జడ్చర్ల మండలంలో గల జడ్పీహెచ్ఎస్ ఆలూరు ఉన్నత పాఠశాల ఎన్జీసి ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆలూరు గ్రామంలో వీధి వీధి ర్యాలీగా తిరుగుతూ అడవుల యొక్క ఆవశ్యకతను ఆలూరు గ్రామ ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతులు  చేయడమైనది. ఈ సందర్భంగా గ్రామ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాలఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు షరీఫ్ మాట్లాడుతూ అడవుల వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించారు. అడవుల శాతాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్క రు కనీసం ఒక మొక్కను పెంచి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్జీసీ ఇంచార్జ్ ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి  మాట్లాడుతూ మొక్కలు మనకు ఆక్సిజన్, ఆహారం వర్షం పర్యావరణ సమతుల్యత వంటి ముఖ్యమైన పనులు నిర్వహిస్తాయని వీటిని పెంచుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందని వివరించారు. తెలుగు ఉపాధ్యాయులు అలీం మాట్లాడుతూ గ్రామాల కంటే అడవులే చాలా ప్రాధాన్యతగలవని ఈ విషయాన్ని మనం గమనించి అడవుల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హరినాథ్, సోమలా నాయక్, సంధ్య, హైమావతి, నిర్మల, మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం