బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి 43 రోజుల ఆలయ హుండీ లెక్కింపు
లోకల్ గైడ్ తెలంగాణ:
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి *43 రోజుల ఆలయ హుండీని శుక్రవారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నిర్మల్ జిల్లా వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్ ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు.43 రోజుల హుండీ ఆదాయం ఈ క్రింది విధంగా సమకూరినది నగదు యాభైమూడు లక్షల ముప్పై ఆరు వేల ఒక వంద డెబ్భై ఆరు రూపాయలు మాత్రమే (53,36,176/-) మిశ్రమ బంగారం 73గ్రా౹౹ మిశ్రమ వెండి 02కి౹౹100 గ్రా.లు విదేశీ కరెన్సీ 21nos నోట్లు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కే. సుధాకర్ రెడ్డి ఏఈఓ సుదర్శన్ గౌడ్ దేవస్థాన వైదిక/పరిపాలనా సిబ్బంది, టి జి బి బ్యాంక్ సిబ్బంది, బాసర పోలీసు సిబ్బంది, దేవస్థాన హోం గార్డ్స్ వాగ్దేవి సొసైటి సభ్యులు రాజరాజేశ్వర సేవాసమితి రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ జిల్లా వార్లతో పాటు నృసింహ సేవాసమితి సికింద్రాబాద్ వారు పాల్గొన్నారు.
Comment List