ఇది సామాన్యుడి నిర్లక్ష్యం…

గొంతు తడవాలంటే పొదుపు చేయాల్సిందే..!

ఇది సామాన్యుడి నిర్లక్ష్యం…

లోకల్ గైడ్ :
హైదరాబాద్‌ మహా నగరంలో జలమండలి రోజుకు సుమారు 560 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తీసుకువస్తున్న జలమండలి చివరి వినియోగదారుడి వరకు ఆ జలాలను అందిస్తున్నదా? ఏమో... సాధారణంగా ఉండే సరఫరా నష్టం (సప్లయి లాస్‌) 7-10 శాతం తీసివేస్తే మరో 20-25 శాతం వరకు నీటి పరిమాణం అసలు లెక్కల్లోకి రావడంలేదనేది (అన్‌ అకౌంటబుల్‌ వాటర్‌) ఓ అంచనా. ఇందులో నీటి చౌర్యమెంత? వృథాగా పోయేది ఇంకెంత.ముదురుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు ఉచిత మంచినీటి పథకాన్ని కాలరాస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. నేడు ప్రపంచ నీటి దినోత్సవం ఇది యంత్రాంగం వైఫల్యం హైదరాబాద్‌ మహా నగరంలో జలమండలి రోజుకు సుమారు 560 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తీసుకువస్తున్న జలమండలి చివరి వినియోగదారుడి వరకు ఆ జలాలను అందిస్తున్నదా? ఏమో… సాధారణంగా ఉండే సరఫరా నష్టం (సప్లయి లాస్‌) 7-10 శాతం తీసివేస్తే మరో 20-25 శాతం వరకు నీటి పరిమాణం అసలు లెక్కల్లోకి రావడంలేదనేది (అన్‌ అకౌంటబుల్‌ వాటర్‌) ఓ అంచనా. ఇందులో నీటి చౌర్యమెంత? వృథాగా పోయేది ఇంకెంత??ఇది సామాన్యుడి నిర్లక్ష్యం…హైదరాబాద్‌ మహా నగరంలో జలమండలి వివిధ నీటి వనరుల ద్వారా సేకరించి సరఫరా చేస్తున్న మంచినీటి కోసం కిలో లీటరుకు (వెయ్యి లీటర్లు) సరాసరిన రూ.30-40 వరకు ఖర్చు చేస్తుందని అంచనా. మరి ఇంత విలువైన జలాలు సామాన్యుడి గొంతు తడపాలి. కానీ రోజూ నగరవాసులు వృథా చేస్తున్న నీటి పరిమాణం ఎంతో తెలుసా?! ఆ పరిమాణంతో ఒక వరంగల్‌ పట్టణంగానీ కరీంనగర్‌ పట్టణంగానీ నీటి అవసరాలను తీర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.అసలే ఎండలు మండి నానాటికీ భూగర్భజలాలు అడుగంటుతున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమూ తోడై నదీజలాలు సైతం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అందుకే నేడు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నగరవాసులు నీటి వృథాపై స్వీయ నియంత్రణగా ప్రతిజ్ఞ తీసుకుని పొదుపు పాటిస్తేనే రానున్న 2-3 నెలల కీలక సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గొంతు తడుస్తుంది.ఒకనాడు చెంతనున్న జంట జలాశయాల నుంచి తాగునీటిని అందుకునే హైదరాబాద్‌ మహా నగరానికి ఇప్పుడు మంజీరా, కృష్ణా, గోదావరిజలాలను తరలిస్తున్నా దాహార్తిని పూర్తిగా తీర్చలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అనేక బృహత్తర లక్ష్యాలను అధికారులు కాగితాలపైనే కాకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తే సమస్య తీవ్రతను చాలావరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.కాంక్రీట్‌ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పక్కాగా అమలు చేయాలనే లక్ష్యం సమస్యలు తెరపైకి వచ్చినపుడే తప్ప మిగిలిన సమయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిని వంద శాతం అమలు చేస్తేనే భావి తరాలకు భూగర్భజలాలు అందుతాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్