రాజీవ్ యువ వికాసం పథకాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి..

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

రాజీవ్ యువ వికాసం పథకాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి..

రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం సరఫరాపై  మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

లోకల్ గైడ్:

రాజీవ్ యువ వికాసం పథకాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్  అన్నారు.బుధవారం కలెక్టరేట్  సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం సరఫరాపై  మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆన్ లైన్ లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని లేదా ఎంపీడీవో కార్యాలయం, మున్సిపల్ కార్యాలయ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 50 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ యూనిట్లు లభిస్తాయని అన్నారు. అభ్యర్థులకు వ్యవసాయేతర యూనిట్లకు  21  నుంచి 55 ఏళ్ళ వయస్సు ఉండాలని, వ్యవసాయ యూనిట్లకు 60 సంవత్సరాల వరకు సడలింపు ఉందని కలెక్టర్ తెలిపారు.  ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఆధాయ ధృవీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రంతో కలిపి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు వెంటనే 3 రోజులలో జారీ చేసేలా తహసీల్దార్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.మండల జనాభా, గ్రామ జనాభా అనుగుణంగా కేటాయించిన లక్ష్యాల ప్రకారం యూనిట్లను మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. స్క్రూటినీ యూనిట్ లో స్పెషలిస్ట్ అధికారులను సైతం ఉంచుతామని అన్నారు. ‌ సెక్టార్ వారీగా అభ్యర్థులకు అవసరమైన శిక్షణ కూడా అందించడం జరుగుతుందని అన్నారు.డాక్యుమెంట్ కారణంగా ఎవరికి యూనిట్ ఆపడం జరగదని కలెక్టర్ తెలిపారు. బ్యాంక్ లింకేజీ రుణాలు కూడా తప్పనిసరిగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు అనవసరంగా తిరస్కరించడానికి వీలు లేదని అన్నారు. అభ్యర్థులకు అవసరమైన శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.ప్రతి రేషన్ షాపులో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న రకం బియ్యం సరఫరా చేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. రేషన్ డీలర్ల ఓనర్ షిప్ రీ-వెరిఫికేషన్ చేస్తామని, సరిగ్గా పని చేయని రేషన్ డీలర్లపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. లబ్దిదారులకు ఎవరైనా సన్న బియ్యం కాకుండా నాణ్యత లేని బియ్యం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీవో సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇంచార్జ్ ఇడి నవీన్ బాబు, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎన్ విజయలక్ష్మీ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. బి. పురంధర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News