తుర్కయంజాల్ చౌరస్తాలో వర్గీకరణ సాధకుడు  మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం.

రాష్ట్ర బిజెపి నాయకులు బచ్చి గళ్ళ రమేష్

తుర్కయంజాల్ చౌరస్తాలో వర్గీకరణ సాధకుడు  మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం.

లోకల్ గైడ్:

 తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో  మాదిగ జేఏసీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వదిగల్ల బాబు,ఉపాధ్యక్షులు మేతరి కుమార్ వారి ఆధ్వర్యంలో వర్గీకరణ చట్టబద్ధత ఆయన సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర బిజెపి నాయకులు బచ్చిగల్ల రమేష్ , తుర్కయంజాల్ మాదిగ జేఏసీ కన్వీనర్ కొండ్రు పురుషోత్తం, ఎమ్మార్పీఎస్ నాయకులు కొంగర రవి, కార్యక్రమంలో పాల్గొని తుర్కయంజాల్ చౌరస్తా అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ల విగ్రహాలకు పూలమాల సమర్పించి అనంతరం వర్గీకరణ సాధించిన ఉద్యమ నేత దళిత యోధుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్ల కల ,ఎన్నో అవమానాలు ఎంతో మంది బలిదానం తర్వాత నేడు వర్గీకరణ సాధ్యమైనందుకు ,దానికి చట్టబద్ధత కల్పించినందుకు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకు, మరియు గౌరవ ప్రధాని గారికి ,తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బాణాసంచాలు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. 
ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ బిజెపి నాయకులు మైలారం బాబు ,స్థానిక అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొమ్మని దర్శన్ ,బీఎస్పీ నాయకులు జంతుక సైదులు , రంజిత్ కుమార్ ,  ఎమ్మార్పీఎస్ నాయకులు సతీష్, గోపాల్ ,మాదిగ జేఏసీ నాయకులు గుడ్ల దయాకర్,చెక్క మహేందర్ , మేతర శ్రీకాంత్ , చెక్క శ్రీకాంత్ , కంతి యాదగిరి ,చెక్క ధనరాజ్,చెక్క నవీన్ , గుడ్ల వినోద్ ,కానాపురం మహేష్ , మేతరి నవీన్ , మేతరి అర్జున్ ,కొమ్మని వంశి , చెక్క శివ గణేష్, చెక్క బబ్లు , చెక్క లవ,చెక్క శ్రావణ్ ,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం