రికార్డులు సృష్టించాలన్న మేమే... వాటిని తిరిగి రాయాలన్న మేమే : నారా లోకేష్

రికార్డులు సృష్టించాలన్న మేమే... వాటిని తిరిగి రాయాలన్న మేమే : నారా లోకేష్

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డులు సృష్టించాలన్న... వాటిని బద్దలు కొట్టాలన్న తెలుగుదేశం పార్టీకే సాధ్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. NTR అనే మూడు అక్షరాలు  రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారి ఆత్మ గౌరవం అని అన్నారు. 43 ఏళ్ల క్రితం తారక రామారావు గారు పార్టీని స్థాపించారు. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించిన వ్యక్తి NTR అని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగువారి సత్తా అంటే ఏంటో చూపించారని అన్నారు.  మన తెలుగుదేశం పార్టీకి గల్లి, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు అని చెప్పుకొచ్చారు. మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని నోటికి వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారని... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్  సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

images (13)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News