నేను ఏ పార్టీలోకి వెళ్లట్లేదు... దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి?
లోకల్ గైడ్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మారిబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారాలు వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పార్టీ మారడంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అంతా కూడా అబద్ధమని తెలిపారు. నేను బిఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు అని మల్లారెడ్డి తెలిపారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి, మెడికల్ అలాగే ఇంజనీరింగ్ సీట్ల విషయంలో మాత్రమే సీఎం రేవంత్ రెడ్డితో పలుమార్లు చర్చిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెసులోకి వెళ్లిన ఎమ్మెల్యేలే తికమకలో ఉన్నారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకి తమ కుటుంబం నుంచి ఏకంగా నలుగురు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జెమినీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఎంపీగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. కాగా ఎంతోమంది యువకులకు మల్లారెడ్డి స్ఫూర్తిగా నిలిచారు. మల్లారెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా పాలమ్మిన.. పూలమ్మిన అంటూ ప్రజలలో చైతన్యం నింపుతూ ఉంటారు. టిఆర్ఎస్ పార్టీ లో ఎన్నో ఏళ్లుగా మల్లారెడ్డి ప్రజలకు సేవలు అందించారు. మరి అలాంటి మల్లారెడ్డి పార్టీ మారిబోతున్నట్లుగా సోషల్ మీడియాలో చాలానే ప్రచారాలు జరిగాయి. వాటన్నిటినీ ఖండిస్తూ మల్లారెడ్డి నేడు సమాధానం ఇచ్చారు.
Comment List