నిమిషానికి ప్రభుత్వం అప్పు అక్షరాల కోటి రూపాయలు
లోకల్ గైడ్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర అప్పు రోజురోజుకీ మరింత పెరిగిపోతుందని బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తిపై రెండున్నర లక్షల రుణభారం ఉందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర అప్పు అక్షరాల 8 లక్షల కోట్లకు పైగానే చేరిందని ఆరోపించారు. ప్రతి నిమిషానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు అప్పు చేస్తుందని దుయ్యబట్టారు. ఇలా రుణాలు పెరుగుతూ పోతుంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమని బడ్జెట్ పై చర్చిలో భాగంగా ప్రభుత్వాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. UPA హయాంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాట 32 శాతం ఉంటే ఇప్పుడు 42% అందుతుందని... అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు కేంద్రాన్ని విమర్శించడం అసలు మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. ఎప్పుడు చూసినా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చేస్తున్నాము... అభివృద్ధి చేస్తున్నామని చెప్పడమే కానీ ఇలా అప్పులు చేస్తున్నామని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారని ఎలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఇలా రాష్ట్రానికి అప్పులు చేసుకుంటూ పోతే ఆ భారం చివరికి ప్రజల మీదనే పడుతుందని అన్నారు.
Comment List