ఏకంగా 50 కోట్లు పెట్టి కుక్క ను కొన్న వ్యక్తి!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ప్రపంచంలో రోజుకి ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా మన భారతదేశంలోని బెంగళూరులో కూడా అదే జరిగింది. ఒక కుక్కను పెంచుకోవడానికి మహా అయితే 10000 లేదా మహా అయితే లక్ష రూపాయలు వరకు ఖర్చు చేయగలం. కానీ బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి " కాడ బాంబ్ ఒకామి" అనే అరుదైన 'వూల్ఫ్ డాగ్' ను 5.7 మిలియన్లు అనగా( సుమారు 50 కోట్ల) రూపాయలను పెట్టి కొనుగోలు చేశారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇక్కడ ఆ కుక్కను కొనుగోలు చేసిన బెంగళూరు చెందిన సతీష్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు ఇంకా వైరల్ అవుతున్నాయి. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం... అందుకే డబ్బు ఎంత అనేది చూడకుండా వెంటనే కొనేశాను అని చెప్పుకొచ్చాడు. ఇలాంటి అరుదైన, ప్రత్యేకమైన కుక్కలను ఇండియాకు పరిచయం చేయాలనేదే నాకు చాలా ఇష్టం అలాగే నా కళ అంటూ చెప్పకొచ్చారు. కాగా ఈ డాగ్ అనేది యూఎస్ లో జన్మించిందట. ప్రస్తుతం ఈ కుక్క వయసు 8 నెలలు అని చెప్పారు. దీనికి ప్రతి రోజు కూడా మూడు కేజీల పచ్చి మాంసం ఆహారంగా పెడుతున్నామని అన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజనులు ఈ కుక్క బదులు ఆ 50 కోట్లను ప్రజల అవసరాలకు ఖర్చు చేస్తే బాగుండేదని అన్నారు. అలాగే ప్రతిరోజు మూడు కేజీల మాంసం పెట్టే బదులు మూడు పూటలు ఎవరికైనా ఆహారం అందిస్తే ఇంకా బాగుండేది అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది సతీష్ అనే వ్యక్తికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.
Comment List