సునీత విలియం రాకపై-- ఆశల ఆశల వెలుగులు
లోకల్ గైడ్, తెలంగాణ:- 288 రోజులపాటు అంతరిక్షంలో గడిపి రేపు బుధవారం ఉదయం భూమి మీదకు తిరిగి రాబోతున్నది. ఆమె రాక కోసం ప్రపంచమంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నది.
ప్రపంచ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీత విలియం తన అంతరిక్ష ప్రయాణాన్ని ముగించి భూమి పైకి తిరిగి రానున్నారు. ఇది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన భారతీయుల ప్రతిభకు తార్కాణం.
సునీతా విలియం 1965లో జన్మించారు. ఆమె భారతీయ సంతతికి చెందినది.అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో ప్రముఖ స్థాయిలో ఉన్నారు. అంతరిక్షంలో గడిపిన సమయం, నిర్వహించిన ప్రయోగాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐ ఎస్ఎస్ లో చేసిన కృషి వల్ల ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తన అద్భుత తెలివితేటలతో ఎన్నో ఘన విజయాలు సాధించింది. అంతరిక్ష మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్ లో అనేక ప్రయోగాలు నిర్వహించి విజయవంతం చేశారు.ఆమె నేతృత్వంలో జీరో గ్రావిటీ ప్రయోగాలు, కొత్త టెక్నాలజీ పరీక్షలు, జీవశాస్త్ర సంబంధిత పరిశోధనలు జరిగాయి. ఇవి భవిష్యత్తులో మన అంతరిక్ష యాత్రలకు, భూమిపై సైన్స్ రంగ అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి. వినూత్నమైన పరిశోధన వల్ల ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించారు. 288 రోజులు అంతరిక్షంలో ఉండి రేపు ఉదయం ఆరు గంటలకు భూమి పైకి, ఆమె సహచర వ్యోమగాములతో కలిసి భూమి పైకి తిరిగి వస్తున్నారు. సోయుజ్ క్యాప్సూల్ ద్వారా వాయువ్య ఖండంలోని నిర్దిష్ట ప్రదేశంలో ఆమె ల్యాండ్ అవుతారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడపడం వల్ల శరీరంలో మార్పులు వచ్చి ఉండే అవకాశం ఉంది కాబట్టి, పునరావాస ప్రక్రియలో ఆమెను వైద్యులు గమనిస్తారు. భారతదేశం మొత్తం గర్వపడే క్షణాలు రాబోతున్నాయి.
సునీత విలియం ప్రయాణం భారతీయ సంతతికి గర్వకారణం. భారతీయ మహిళలు అంతరిక్ష రంగంలో కూడా సుస్థిర స్థానాన్ని సంపాదించగలరని మరోసారి ఆమె నిరూపించారు. యువతకు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
సునీత విలియం తిరిగి భూమిపైకి వచ్చే ఈ గౌరవనీయమైన క్షణం అంతరిక్ష పరిశోధనలో కొత్త మైలురాయిగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా యాపత్ ప్రపంచమంతా ఆమెకు జేజేలు పలుకుతున్నది. ఆమె సాధించిన విజయాలు నేటి యువతకు ఆదర్శంగా భవిష్యత్తులో మరెన్ని అంతరిక్ష పరిశోధనలు చేయడానికి ఆమె సాధించిన విజయాలే యువతకు ఆదర్శంగా ఉంటాయి. ప్రపంచమంతా సునీత విలియంకు జేజేలు పలుకుతున్నది.
Comment List