పుతిన్ త్వరలోనే మరణిస్తారు : జెలెన్ స్కి
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- రష్యా అధ్యక్షుడు పుతిన్ కు టైం దగ్గర పడిందని త్వరలోనే మరణిస్తాడని ఉక్రెయున్ అధ్యక్షుడు జెలెన్ స్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎలాగైనా సరే పుతిన్ మరణిస్తే గాని ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని జెలన్ స్కి అన్నారు. పుతిన్ కి టైం దగ్గర పడిందని, కచ్చితంగా మరణిస్తారని... ఇది కచ్చితంగా జరుగుతుందని జెలెన్కి స్కి అన్నారు. కాగా పుతిన ఆరోగ్యం పై పలు ఊహగానాలు సోషల్ మీడియాలో వెలవడుతున్న సందర్భంలో జెలెన్ స్కి ఇలా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. మరోవైపు ఇరుదేశాల మధ్య కూడా యుద్ధం ఆగిపోయి మంచి సంబంధాలు కుదర్చాలని జెలెన్స్ కి అమెరికాను కోరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో జెలెన్ స్కి నేరుగా రష్యా అధ్యక్షుడు మరణిస్తారు అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయాయి. ప్రస్తుతం ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ వ్యాఖ్యలు నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
Comment List