వ్యోమగాములకు నా సొంత డబ్బును జీతాలుగా చెల్లిస్తా : డోనాల్డ్ ట్రంప్
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు విల్ మోరాలు దాదాపుగా 9 నెలల పాటుగా అంతరిక్షంలోనే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉండిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. 8 రోజులు మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నాసా వ్యోమగాములు రెండు రోజుల క్రితం భూమ్మీదకు వచ్చారు. అయితే దాదాపుగా 9 నెలలపాటు అంతరిక్షంలోని గడిపిన వీళ్లిద్దరికి అదనపు జీతం... ప్రతిరోజు కూడా ఐదు డాలర్ల చెప్పునా 286 రోజులకు 1430 డాలర్లు వేతనాన్ని నాసా ఇవ్వకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పటివరకు నాకు తెలియదని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే నియోమగాములకు అదనపు జీతం చెల్లించాల్సిన 1430 డాలర్లు తన సొంత డబ్బును వారికి జీతాలుగా ఇస్తానని స్పష్టం చేశారు. దేశాల కోసం త్యాగాలు చేసే వారిని నేనెప్పుడూ కూడా తక్కువ చేసి చూసే వ్యక్తిని కాదని ట్రంప్ చెప్పుకొచ్చారు. సునీత విలియమ్స్ మరియు విల్ మోరాలకు అదనంగా పనిచేసిన దినాలకు గాను నా సొంత డబ్బులను వాళ్లకి జీతాలుగా ఇస్తానని చెప్పుకొచ్చారు.
Comment List