జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.
బిఆర్ఎస్ కు దళితులను దూరం చేసి జగదీష్ రెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ యత్నం.
సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం న్యాయపరంగా కొట్లాడుతాం .
బిఆర్ఎస్ జిల్లా లీగల్ సెల్
లోకల్ గైడ్ తెలంగాణ.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో అమలు చేయని హామీలు అబద్ధాలు ఉన్నాయంటూ జగదీష్ రెడ్డి మాట్లాడితే దళిత స్పీకర్ ను అవమానించాడంటూ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం కాంగ్రెస్ కుట్రపూరిత చర్య అని సూర్యాపేట జిల్లా బి ఆర్ ఎస్ లీగల్ సెల్ అధ్యక్షులు నల్లకుంట్ల అయోధ్య, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గొం డ్రాల అశోక్, న్యాయవాదులు దావుల వీరప్రసాద్ యాదవ్, తలమల్ల హసేన్ లు అన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదెండ్లు క్యాబినెట్ మంత్రిగా ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనలో ఎవరికీ ఎలాంటి భంగం కలగకుండా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యవహరించారని గుర్తు చేశారు. స్పీకర్ కుటుంబానికి పెద్ద అని అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలనడాన్ని తప్పుపడుతూ కుట్రపూరితంగా బడ్జెట్ సమావేశాల వరకు సస్పెన్షన్ విధించడం తగదన్నారు. జగదీష్ రెడ్డి దళిత వ్యతిరేకి అని దళిత సంఘాలను ఉసిగొలిపి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగదీష్ రెడ్డి విద్యార్థి ఉద్యమం మొదలు నేటి వరకు దళిత బహుజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడని అన్నారు. రైతులకు నీళ్లు లేవని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ప్రజలు ఎక్కడ బిఆర్ఎస్ కు దగ్గర అవుతారో మాకు ఎక్కడ దూరం అవుతారో అనే భయంతో కాంగ్రెస్ కుట్రపూరితంగా జగదీష్ రెడ్డి పై సస్పెన్షన్ విధించింది అన్నారు. బి ఆర్ ఎస్ కు దళితులను దూరం చేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నిదని అన్నారు. జగదీష్ రెడ్డి పై సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని రేవంత్ రెడ్డికి డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు నిలదీస్తాయని కొన్ని సంఘాలను రెచ్చగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నాడని అన్నారు. అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి మాట్లాడిన తీరును యావత్ తెలంగాణ వీక్షించిందని లైవ్ వీడియోలు కూడా ఉన్నాయని జగదీష్ రెడ్డి తప్పు మాట్లాడలేదని ప్రజలు అంటుంటే జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించాడని సస్పెన్షన్ విధించడం పట్ల తెలంగాణ ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వెంటనే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను ఎత్తివేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించడంతో పాటు న్యాయపరంగా పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు డపుకు మల్లయ్య, తొగటి మురళీ,ఎండి లతీఫ్, మీలా రమేష్, జెసి చంద్రమౌళి, మీసాల శ్రీను, రేగట్టే శంకరయ్య,ఊట్కూరి సైదులు, చిప్పలపల్లి చిరంజీవి, తదితరులు ఉన్నారు.
Comment List